Big tv Kissik Talks: బిగ్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Bigtv Kissik Talks) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీరియల్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రేరణ(Prerana) హాజరయ్యారు. ఇక ప్రేరణ ఎప్పటిలాగే తన అల్లరితో, సరదా మాటలతో ఈ కార్యక్రమంలో సందడి చేశారని ప్రోమో వీడియో ద్వారా తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేరణ టీవీ షోస్ గురించి సీరియల్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
బ్రేకప్ చెప్పుకున్న ప్రేరణ..శ్రీ పాద్
ఇకపోతే గత ఏడాది ఈమె శ్రీపాద్(Sripaad) అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వైవాహిక జీవితంలో కూడా ప్రేరణ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రేమ పెళ్లి గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు రిలేషన్ లో ఉంటూ బ్రేకప్ చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే తన జీవితంలో కూడా బ్రేకప్స్(Break up) ఉన్నాయి అంటూ ప్రేరణ సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక సీరియల్ కారణంగా తనకు శ్రీపాద్ మధ్య బ్రేకప్ జరిగిందని ప్రేరణ తెలియజేశారు.
ఆ హీరోతో ముద్దు సీన్..
శ్రీ పాద్ తో రిలేషన్ లో ఉన్న కొద్ది రోజులకి ఒక సీరియల్లో తాను నటించే సమయంలో హీరో ముద్దు పెట్టే సీన్ ఉంది. ఆ విషయం గురించే ఇద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకున్నాము అంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా హీరో ముద్దు పెట్టినందుకే బ్రేకప్ చెప్పారా? అంటూ వర్ష అడగడంతో అక్కడ ముద్దు పెట్టింది నేను అంటూ ఈమె ట్విస్ట్ ఇచ్చారు. ఇలా బ్రేకప్ తర్వాత తిరిగి మా తప్పు తెలుసుకుని కలిసిపోయామని, ఇక శ్రీపాద్ తో పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న నెల కిందటే ఆయనతో డేట్ లో ఉన్నాననే ఫీలింగ్ లో ఉన్నానంటూ ఈ సందర్భంగా ప్రేరణ తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఒక షోలో ఇమ్మాన్యూయేల్ తో జరిగిన గొడవ గురించి స్పష్టత ఇచ్చారు . అలాగే హీరోయిన్ రష్మిక (Rashmika)తో తన ఫ్రెండ్షిప్ గురించి కూడా ఈ సందర్భంగా ముచ్చటించారని తెలుస్తుంది. ఇక మీ గురించి ఒక మంచి గాసిప్ చెప్పమని వర్ష అడగడంతో నన్ను అందరూ హీరోయిన్ కీర్తి సురేష్ లాగా ఉంటావు అని చెబుతుంటారు కానీ ఏ డైరెక్టర్ కి కూడా నేను అలాగా కనిపించలేదేమో అందుకే నాకు ఇప్పటివరకు ఎవరు సినిమాలలో ఛాన్స్ ఇవ్వలేదు అంటూ ఈమె సరదాగా మాట్లాడారు. ఏది ఏమైనా ప్రేరణ ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే తన అల్లరితో, మాటతీరుతో సందడి చేశారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం సాయంత్రం ఏడు గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ప్రసారం కానుంది.
Also Read: Thug Life: థగ్ లైఫ్ ఎఫెక్ట్..బూతులు తిడుతున్నారు.. అలీ ఫజల్ సంచలన వ్యాఖ్యలు!