Sree Leela:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది శ్రీలీల (Sree Leela). ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ‘ధమాకా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని.. వరుసగా ఒకే ఏడాది తొమ్మిది చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత కాలంలో కథలు ఎంపిక విషయంలో తడబడ్డ ఈమెకు వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి. అలా సైన్ చేసిన కొన్ని సినిమాల నుండి తప్పించారు కూడా. మళ్లీ బాలయ్య (Balayya ) ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించి నిలదొక్కుకుంది. ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా తన ఆలోచనలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఒకేసారి వారి సినిమాలలో అవకాశం వస్తే?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్(Ram Charan) సినిమాలలో ఒకేసారి నటించే అవకాశం వస్తే.. ” డే అండ్ నైట్ షిఫ్టులు కూడా చేస్తానని” చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ (Raviteja ) అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపిన ఈమె.. సమంత (Samantha) తన ఫేవరెట్ హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి (Sai Pallavi) అంటే కూడా ఇష్టం అని తెలిపింది శ్రీ లీల. ప్రస్తుతం శ్రీ లీలా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
డే అండ్ నైట్ కష్టపడతాను – శ్రీ లీల
ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమాలలో నటించే అవకాశం రావాలని.. ఒకవేళ అలా వస్తే రాత్రింబవళ్లు పనిచేయడానికి కూడా వెనుకాడను అంటూ తన మనసులో మాట చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది శ్రీ లీల. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఈ కామెంట్స్ విన్న కొంతమంది నిజంగా వర్కౌట్ అవుతుందంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీ లీల కెరియర్..
2001 జూన్ 14న డెట్రాయిట్ మిచిగాన్ అమెరికాలో జన్మించిన ఈమె భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలలోనే కాదు ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2019లో విడుదలైన ‘కిస్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. అంతకుముందు బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం ఇలా పలు చిత్రాలలో నటించగా.. ఈమెకు ఏకంగా మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు కూడా లభించాయి. ఈమె తల్లి స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందినవారు. బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని శుభకర రావు..అయితే శ్రీ లీల జన్మించిన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు.. ఇంక తల్లి దగ్గరే ఉంటున్న శ్రీ లీల మొన్నా మధ్య ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.