Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మను టార్చర్ చేయాలని పిల్లలతో కలిసి గార్డెన్‌లో పుట్‌బాల్ అడుతుంది మనోహరి. బాల్ పదే పదే ఆరు బంధించిన ఉన్న వైపే వేస్తుంది మనోహరి. ప్రతిసారి అంజు వచ్చి బాల్ ఆరుకు తగలకుండా సేవ్ చేస్తుంది. దీంతో ఆరు థాంక్యూ అంజూ అని చెప్తూ మిస్టర్ గుప్త ఫ్లీజ్ నన్ను కాపాడండి అని అడుగుతుంది. దీంతో మాతో పైకి రమ్మని నిన్ను పలుమార్లు హెచ్చరించినా నువ్వు ఆలకించితివా బాలిక మా మాటను పెడచెవిన పెట్టి నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటివి అంటాడు గుప్త. అంతు పైనుంచి చూస్తున్న గుప్త ఏమోషనల్ అవుతుంటాడు. బాధ తట్టుకోలేక తుమ్మెద రూపంలో వెళ్లి ఆరును కాపాడతాడు.
మరోవైపు రణవీర్ ఇంట్లో పూజ చేస్తున్న చంబా వెంటనే పూజలోంచి లేచి గట్టిగా అరుస్తూ ఆ ఆత్మ తప్పించుకుంది రణవీర్ అని చెప్తుంది. రణవీర్ షాక్ అవుతాడు. అదెలా సాధ్యం. నువ్వేసిన మంత్రాల దాటికి ఆ ఆత్మ బయటకు వెళ్లలేదని చెప్పావు కదా..? మరుగుజ్జుకు మారిని ఆత్మకు తన శక్తులేవీ పని చేయవని చెప్పావు కదా..? అని అడుగుతాడు రణవీర్. నన్ను మించిన శక్తి ఏదో ఆ ఆత్మను కాపాడింది. నా పంజరంలో బంధీ కావాల్సిన ఆ చిలుక ఎగిరిపోయింది. ఇందుకే నేను చెప్పాను. ఈరోజే దాని కథ ముగించాలని మరోసారి అది తప్పించుకుంది అంటూ కోపంగా చూస్తుంటుంది.
మరోవైపు రాథోడ్ ఎవరో స్వామిజీ తీసుకుని వస్తాడు. స్వామిజీని చూసిన మనోహరి దగ్గరకు వెళ్లి రాథోడ్ ఏంటి పంతులు గారిని తీసుకొస్తున్నావు అని అడుగుతుంది. సార్ తీసుకురమ్మన్నారు అని రాథోడ్ చెప్పి స్వామిజీని తీసుకుని లోపలికి వెళ్తాడు. సడెన్‌గా అమరేంటి స్వామిజీని తీసుకురమ్మన్నారు అనుకుంటుంది. ఇంతలో రణవీర్ ఫోన్ చేస్తాడు. పోన్ లిఫ్ట్ చేసిన మను చెప్పు రణవీర్ అని అడుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది మనోహరి అని రణవీర్ అడగ్గానే.. ఆరు పిల్లలతో బంతాట ఆడిస్తున్నాను. ఆరు ఆత్మకు నరకం చూపిస్తున్నాను అని చెప్పగానే.. అంత లేదు ఆత్మ ఇప్పుడు అక్కడ లేదు.. అని రణవీర్ చెప్పగానే.. మను షాక్ అవుతుంది. ఆ ఏం మాట్లాడుతున్నావు రణవీర్ ఎలా తప్పించుకుంది అని అడుగుతుంది.
దీంతో చంభాను మించిన శక్తి ఏదో ఆ ఆత్మను కాపాడిందట అని రణవీర్ చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నావు రణవీర్ చంభాకు మించిన శక్తి ఎవరై ఉంటారు చెప్పు అని అడుగుతుంది. అది తెలుసుకోవడానికే నేను నీకు ఫోన్ చేశాను అక్కడ ఎవరున్నారు అని రణవీర్ అడగ్గానే.. ఇక్కడ నేను పిల్లలు తప్ప ఎవ్వరూ లేరు అని మను చెప్తుంది. సరిగ్గా చూడు అక్కడ ఎవ్వరూ లేకుండా ఆత్మ తప్పించుకోలేదు. ఎవరైనా కనిపించారా..? చెప్పు అని అడగుతాడు. అబ్బా రణవీర్ నాకైతే ఎవ్వరూ కనిపించలేదు ఎవ్వరూ లేరు.. ఆ రణవీర్ ఒక్క నిమిషం ఇప్పుడే పంతులు గారు ఇంటికి వచ్చారు.. తన వల్ల ఏమైనా.. సరే సరే మళ్లీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి లోపలికి వెల్లిపోతుంది.
లోపలికి వెళ్లిన స్వామిజీ అమర్ ను చూస్తూ చెప్పు నాయన అంటూ అడుగుతాడు. దీంతో రాథోడ్ ఈరోజు ఉదయం ఒక గద్ద ఇంటి మీద తిరిగింది పంతులు గారు అప్పటి నుంచి మాకందరికీ దిగులుగా ఉంది అని చెప్తాడు. అలా తిరగడం అపశకునం అంటాడు స్వామిజీ. అందుకే ఏం జరుగుతుందోనని మేమందరం కంగారు పడుతున్నాం పంతులుగారు అంటాడు రాథోడ్. దేవుడి దయవల్ల మా అందరికి ఏమీ కాలేదు పంతులుగారు అని మిస్సమ్మ చెప్తుంది. కానీ మాకు తెలియకుండా ఏదో జరిగింది అనిపిస్తుంది పంతులు గారు అని అమర్ చెప్తాడు. ఇంతలో మనోహరి కల్పించుకుని అందరం బాగానే ఉన్నాం కదా అమర్. ఇంకేం జరిగి ఉంటుంది అని చెప్తుంది.
మా షాపింగ్ మాల్ లో కూడా ఏం ప్రాబ్లమ్ రాలేదు బావగారు అని చిత్ర చెప్తుంది. అమర్ నువ్వు ఊరికే టెన్షన్ పడుతున్నావు అమర్.. ఏమీ జరగలేదు అంటుంది మనోహరి. లేదు కచ్చితంగా ఏదో జరిగింది మన కళ్లకు కనిపించనిది ఏదో జరిగింది అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్ పంతులుగారు ఈ ఇంట్లో మాతో పాటు నా భార్య ఆత్మ కూడా ఉంది. మాకు జరగని హాని ఆమెకు జరిగిందేమోనని అనుమానంగా ఉంది అని అమర్ చెప్పగానే.. ఆత్మకు అపాయం అంటే అది దుష్టశక్తుల నుంచే ప్రమాదం. అందుకోసం ఒక పూజ ఉంది. అది చేద్దాం అని స్వామిజీ చెప్తాడు. దీంతో పూజ చేయడానికి రెడీ అవుతారు. ఇంట్లో పూజ చేస్తున్న విషయం మనోహరి, రణవీర్‌కు ఫోన్ చేసి చెప్తుంది.
అమర్ ఇంట్లో పూజ జరగకూదని ఎలాగైనా ఆ పూజను ఆపాలని చంభా చెప్తుంది. సరేనని చిత్ర, మనోహరి కలిసి పూజను ఆపేందుకు ప్లాన్ చేస్తారు. పూజ జరుగుతుంటే చిత్ర పైకి వెళ్తుంది. తటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం