BigTV English

Galaxy Z Fold 6 Discount: శాంసంగ్ టాప్ ఫోల్టెబుల్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ52500 డిస్కౌంట్

Galaxy Z Fold 6 Discount: శాంసంగ్ టాప్ ఫోల్టెబుల్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ52500 డిస్కౌంట్

Galaxy Z Fold 6 Discount| శాంసంగ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం ఫోన్ ధరను భారీగా తగ్గించింది. మార్కెట్‌లో ఇది ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా మారింది.


ధర, ఆఫర్లు

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G భారతదేశంలో ₹1,64,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం, ₹52,504 ధర తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ₹1,12,495కే అందుబాటులో ఉంది. అంతేకాదు మరో ప్రత్యేక ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా ₹4,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే, చివరి ధర ₹1,08,495 అవుతుంది.


మీ పాత డివైస్‌ను ట్రేడ్-ఇన్ చేస్తే మరిన్ని సేవింగ్స్ పొందవచ్చు. మొత్తంగా, ఈ ప్రీమియం ఫోల్డబుల్‌పై ₹56,500 వరకు సేవింగ్స్ సాధ్యం. ఇప్పటివరకు ఉన్న శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లలో ఇదే అతి తక్కువ ధర. ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి, నెలకు ₹3,955 నుంచి ప్రారంభమవుతాయి. ఇలాంటి డీల్‌తో సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలకు సమానంగా వస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్

గెలాక్సీ Z ఫోల్డ్ 6లో రెండు అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేలు ఉన్నాయి. బయటి కవర్ స్క్రీన్ 6.3 ఇంచ్‌లు, ఇది మీ రోజువారీ పనులకు సరిపోతుంది. లోపలి మెయిన్ డిస్‌ప్లే 7.6 ఇంచ్‌లు, మీడియా వినియోగం, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. రెండు డిస్‌ప్లేలు బ్రైట్ నెస్, క్లియర్ గా స్మూత్‌గా ఉంటాయి. ఫోల్డబుల్ డిజైన్‌తో పాకెట్‌లో సులభంగా సరిపోతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంది. IP48 వాటర్ రెసిస్టెన్స్‌తో నీటి చుక్కలు, లేదా తడిగా ఉన్నా.. తట్టుకుంటుంది.

పెర్ఫార్మెన్స్, స్టోరేజ్

ఈ డివైస్ ఆండ్రాయిడ్‌లో అత్యుత్తమ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. గేమ్స్, వీడియోలు, యాప్‌లకు సరిపోతుంది. పెర్ఫార్మెన్స్ అద్భుతం, యాప్‌ల మధ్య స్విచింగ్ వేగం. 4400 mAh బ్యాటరీతో ఒకే చార్జ్‌పై రోజంతా ఉపయోగించవచ్చు. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 25W సపోర్ట్ ఉంది.

కెమెరా ఫీచర్లు

ఫోటోలకు Z ఫోల్డ్ 6లో 50ఎమ్‌పీ మెయిన్ కెమెరా, 12ఎమ్‌పీ అల్ట్రా-వైడ్, 10ఎమ్‌పీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వివిధ లైటింగ్, యాంగిల్స్‌లో అద్భుత ఫోటోలు తీయవచ్చు. కవర్ స్క్రీన్‌పై 10ఎమ్‌పీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోల్డబుల్ స్క్రీన్ కింద 4ఎమ్‌పీ సెల్ఫీ కెమెరా ఉంది. గెలాక్సీ AIతో ఫోటో ఎడిటింగ్ సులభం – ఆబ్జెక్ట్‌లను మూవ్ చేయడం, ఎరేజ్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ చేయడం.

ఈ డీల్ బెస్ట్.. ఎందుకంటే?

ఈ డీల్ Z ఫోల్డ్ 6 ధరను సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల స్థాయికి తగ్గిస్తుంది. అద్భుత స్పెక్స్, స్మూత్ పెర్ఫార్మెన్స్, అసాధారణ మల్టీటాస్కింగ్ సామర్థ్యాలతో టెక్ లవర్స్‌కు పర్ఫెక్ట్. ట్రేడ్-ఇన్, పేమెంట్ కార్డ్ ఆఫర్లు మరింత వాల్యూ ఇస్తాయి. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌కు మారడానికి ఇదే సరైన సమయం. ఆలస్యం చేయవద్దు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే చెక్ చేయండి!

Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

Related News

Apple Vision Pro vs Vivo Vision: మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ రంగంలో తీవ్ర పోటీ.. ఆపిల్, వివో ఢీ!

Pixel 10 Whatsapp: నెట్‌వర్క్ లేకుండా వాట్సాప్ కాల్స్.. ఈ ఫోన్ లో మాత్రమే.. ఎలా చేయాలంటే?

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Big Stories

×