E-Paper
Advertisement

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!
Advertisement

Caste Census: స్వేచ్చ బ్యూరో: దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులు పరిరక్షించబడాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిమంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణనను విజయవంతంగా నిర్వహించిందని మంత్రి తెలిపారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ సేకరించిన ఈ డేటా ద్వారా, బీహార్ తర్వాత కులగణన చేపట్టిన ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ దేశవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు..

కులగణన అనేది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, ఇది దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా సభలు,ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కులగణన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల తరహాలోనే సామాజిక న్యాయం, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కోసం బడుగు వర్గాలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

Also read: తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

42 శాతం రిజర్వేషన్ల తీర్మానం..

ఇప్పటికీ అనేక వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని, స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే శాసనసభ తీర్మానం చేసిందని, కేబినెట్ కూడా దీనిపై నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగింపుపై చర్చ జరగాలని, ఖచ్చితమైన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగబద్ధమైన అధికారాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామసభల్లో కులగణనకు అనుకూలంగా తీర్మానాలు చేసి కేంద్రంపై ప్రజాస్వామ్య బద్ధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. కులగణన కోసం ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Also read: విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×