Sundeep Kishan Sigma Box Office:సందీప్ కిషన్ కెరీర్‌లో ఈ మధ్యకాలంలో సరైన కమర్షియల్ హిట్ పడని సంగతి తెల్సిందే . మంచి కథలు ఎంచుకుంటూ, డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నా.. తన రేంజ్‌కు తగ్గ బ్లాక్‌బస్టర్ మాత్రం కాస్త ఆశ్చర్యమే.
ఇప్పుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిగ్మా’తో అయినా ఆ లెక్క మారుతుందా? అంటే సినిమా కలెక్షన్స్ చూస్తే మాత్రం పరిస్థితి అంత ఈజీగా లేదనే చెప్పాలి .
అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సిగ్మా’
విషయం లోకి వస్తే సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘సిగ్మా’ అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు .ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించడాం తో సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది.పైగా సినిమాకి మంచి బజ్ కనిపించింది కూడా
అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘సిగ్మా’కు సరైన ఓపెనింగ్ పడనట్టే కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా మొదటి రోజు ఇండియాలో రూ.2.45 కోట్ల నెట్ వసూలు చేసినట్టు తెలుస్తుంది . ఇండియా గ్రాస్ దాదాపు రూ.2.80 కోట్లు అయితే ఇందులో తమిళ వెర్షన్ రూ.1.50 కోట్ల నెట్ రాబట్టగా తెలుగు వెర్షన్ రూ.85 లక్షల నెట్ వసూలు చేసినట్టు తెలుస్తుంది .ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కలిపి దాదాపు రూ.1 కోటికి పైగా గ్రాస్ వచ్చినట్టు సమాచారం
సర్దేసుకున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది
ఇక్కడే సందీప్ కిషన్ సినిమా సర్దేసుకున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద ఉన్న అంచనాలతో పోలిస్తే ఈ ఓపెనింగ్ సరిపోదని చెప్పాలి . ముఖ్యంగా తెలుగులో సందీప్ కిషన్‌కు ఉన్న మార్కెట్‌ను చూస్తే.. తొలి రోజు కలెక్షన్స్ ఇంత తీసికట్టుగా ఉండటం ఆశ్చర్యమే.
ఇక రెండో రోజు అయితే కలెక్షన్స్ మరింత తగ్గడం గమనార్హం.. అక్టోబర్ 3న ‘సిగ్మా’ ఇండియాలో సుమారు రూ.1.50 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది .. అంటే మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 36 శాతం డ్రాప్ అయినట్టు లెక్క .. దీంతో రెండు రోజుల్లో సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు రూ.3.90 కోట్లకు మాత్రమే చేరడం చూస్తే సినిమా ఇక కోలుకుంటున్నట్టు కనిపించట్లేదు . ఇక శని, ఆదివారాల్లో కూడా థియేటర్ లలో ఆక్యుపెన్సీ పెద్దగా కనిపించలేదని తెలుస్తుంది .
30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సిగ్మా’
అసలే సినిమాకి దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు సమాచారం. మరోవైపు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ వంటి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.23 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
అంటే . థియేట్రికల్‌గా సుమారు రూ.15 కోట్ల గ్రాస్ సాధిస్తే హిట్ టార్గెట్‌కు చేరే అవకాశం ఉందన్న మాట .అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలుగానే పరిగణించాలి .
also read:శర్వా ‘భోగి ‘కూడా ఆ దారిలోనే వెళ్తుందా?
అయితే సినిమాలో సందీప్ కిషన్ నటనకు మాత్రం మంచి అప్లాజ్ రావడం గమనార్హం. కానీ కథ, స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ విషయంలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది .చూడాలి మరి ముందు ముందు ఏమైనా ఈ కలెక్షన్స్ లో వేగం పెరుగుతుందేమో !