E-Paper
Advertisement

బిగ్ బాస్ మహిమ..సంజన గల్రానీలో ఇంత మార్పా.. ట్రోలర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా?

బిగ్ బాస్ మహిమ..సంజన గల్రానీలో ఇంత మార్పా.. ట్రోలర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా?
Advertisement

Bigg Boss Sanjjanaa:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సోషల్ మీడియాలో.. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగిందంటే ఆ సెలబ్రెటీలను ఏ రేంజ్ లో ట్రోల్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనను మొదలుకొని ప్రవర్తించే తీరు వరకు ప్రతిదీ కూడా జాగ్రత్త పడాల్సిందే అనే రేంజ్ లో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. అయితే ఈ ట్రోల్స్ తట్టుకోలేక కొంతమంది సెలబ్రిటీలు కన్నీటి పర్యంతం అయితే.. మరికొంతమంది ట్రోల్స్ ని సరదాగా తీసుకుంటూ కొత్త పాఠం నేర్చుకుంటున్నాం అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తనదైన అద్భుతమైన నటనతో వెండితెరపై అబ్బురపరిచి.. ఇటు బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటిన ఒక బిగ్ బాస్ బ్యూటీ ఊహించని సమాధానం చెప్పి ట్రోలర్స్ కి తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చింది.

ట్రోలర్స్ కి గట్టి ఝలక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

ఆమె ఎవరో కాదు సంజన గల్రానీ (Sanjjanaa galrani). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన.. తన సినీ ప్రయాణం గురించి, తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో తాను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా సెలబ్రిటీలపై ట్రోలింగ్ వస్తే వారు అసహనం వ్యక్తం చేస్తారు. కొంతమంది ఘాటుగా స్పందిస్తారు. మరి కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ తాను మాత్రం తనను ట్రోల్స్ చేసే వారిని ఎప్పటికీ ప్రేమిస్తాను అంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది. ఐ లవ్ మై ట్రోలర్స్ అంటూ తనదైన శైలిలో మాట్లాడిన సంజన అదే సమయంలో ఐ డోంట్ కేర్ అనే రేంజ్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

క్రిటిక్స్ ఉండటం మంచిదే..

Advertisement

సంజన స్పందిస్తూ.. “నన్ను ఎవరైనా ట్రోల్స్ చేస్తే నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. విమర్శలు చేసేవారు ఉండడం వల్ల మన లోపాలను తెలుసుకొని అవకాశం ఉంటుంది. నాపై వచ్చే కామెంట్లను నేనెప్పుడూ పాజిటివ్గా తీసుకుంటాను. మీరు ఇంకా నన్ను ట్రోల్స్ చేయండి. మీరు చెప్పినట్టుగానే నన్ను నేను మార్చుకుంటాను. మీరు ఎవరైనా లావుగా ఉన్నారు అని అంటే.. నేను మరింత సన్నగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. విమర్శలు చేసే వాళ్ళు ఉంటేనే మనం మరింత అలర్ట్ అవుతాం.. అంటూ తనపై వచ్చే ప్రతి కామెంట్ మంచిదే” అంటూ సంజన రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికైతే ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా.. తనను ఎవరు ఏమి చేయలేరని, పైగా ఆ ట్రోల్స్ వల్ల తాను మరింత మెరుగుపడతానని , ఇక ఎవరిని లెక్క చేయను ఐ డోంట్ కేర్ అనే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే సంజనలో ఇంత మార్పు రావడంతో బిగ్ బాస్ మహిమ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

also read: సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

సోషల్ మీడియా ట్రోల్స్ పైనే రియాక్షన్..

Advertisement

ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసు వివాదం అప్పట్లో ఆమె జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వివాదంపై పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేసింది. ముఖ్యంగా తను చేయని తప్పుకు శిక్షణ అనుభవించానంటూ కన్నీటి పర్యంతం అయింది . ఇటు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తన వ్యక్తిత్వంతో మరింత మంది అభిమానులను దక్కించుకుంది. ఇప్పుడు ‘ఏ దేవి వరమో నీవు ‘ అనే సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తూ బిజీగా మారింది సంజన.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×