How to Recover Notifications: రోజూ మన స్మార్ట్ ఫోన్‌కు రకరకాల నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. వీటిలో.. కొన్ని ఆఫీసు మెయిల్స్, బ్యాంకింగ్ అలర్ట్‌లు, లేదా అత్యవసర మెసేజ్‌లు ఉండొచ్చు. ఒక్కో సారి ఫోన్‌ను క్లీన్ చేసేటప్పుడు లేదా హడావిడిలో ముఖ్యమైన నోటిఫికేషన్‌లను కూడా మనం పొరపాటున స్వైప్ చేసి తొలగిస్తుంటాం. ఆ తర్వాత అందులో ఏముందో తెలుసుకోవాలనిపించినా, అప్పటికే అది స్క్రీన్ పై నుంచి అది మాయమైపోతుంది. అయితే.. మీరు తొలగించిన ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ అవుతూనే ఉంటుంది. ఆ పూర్తి రికార్డ్‌ను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో.. ఉంటుంది. బెస్ట్ ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే దీన్ని ముందుగానే యాక్టివేట్ చేసుకోవాలి.
1. ముందుగా మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ యాప్‌ని ఓపెన్ చేయండి.
2. అందులో Notifications లేదా Apps & Notifications ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. అక్కడ Notification History అనే.. ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోండి.
4. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను Turn On చేయండి.
5. ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత.. మీరు తొలగించిన ప్రతి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ స్టోర్ చేయబడతాయి. ఒక వేళ మీ ఫోన్‌లో.. ఈ ఫీచర్ నేరుగా కనిపించకపోతే.. సెట్టింగ్స్ లోని .. సెర్చ్ బార్‌లో ‘Notification History’ అని టైప్ చేసి వెతకొచ్చు.
మీరు పైన తెలిపిన విధంగా నోటిఫికేషన్ హిస్టరీని ఆన్ చేసి ఉంటే.. పోగొట్టుకున్న మెసేజ్‌లను చూడటం చాలా ఈజీ.
1.మళ్లీ ఫోన్ Settings లోకి వెళ్లి Notifications సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
2. తర్వాత Notification History పై క్లిక్ చేయండి.
3. అక్కడ గత 24 గంటల్లో మీ ఫోన్‌కు వచ్చిన అన్ని నోటిఫికేషన్‌ల లిస్ట్ టైమ్ , యాప్ పేరుతో సహా కనిపిస్తుంది.
4.వాట్సాప్, మెసేంజర్స్ లేదా ఇతర యాప్‌ల నుంచి డిలీట్ అయిన మెసేజ్‌లను ఇక్కడ చదవొచ్చు.
Also Read: బయటి శబ్దాలకు చెక్ పెట్టే ఏఎన్‌సీ.. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఒకవేళ మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ప్రత్యేక ఫీచర్ అందుబాటులో లేకపోతే.. గూగుల్ ప్లే స్టోర్ నుండి న థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. Notification History Log లేదా Recent Notification వంటి యాప్‌లు మీ ఫోన్‌లోని ప్రతి అలర్ట్‌ను రికార్డ్ చేసి ఉంచుతాయి. అయితే.. ఈ యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు సెక్యురిటీ అంశాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
చివరగా.. ఈ చిన్న ట్రిక్ ద్వారా మీరు ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికీ కోల్పోకుండా జాగ్రత్తపడొచ్చు. పొర పాటున నోటిఫికేషన్ డిలీట్ అయితే కంగారు పడకుండా వెంటనే ఈ పద్దతుల ద్వారా చెక్ తిరిగి చూడొచ్చు. ఇది ముఖ్యమైన నోటిఫికేషన్స్ మిస్ అయినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది.