E-Paper
Advertisement

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?
Advertisement

Aishwarya Rajesh:సంక్రాంతి హీరోయిన్ అంటే ఇటీవల కాలంలో మీనాక్షి చౌదరి గుర్తొస్తుంది. వరుసగా గుంటూరు కారం , సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి తెలుగమ్మాయిగా పేరు దక్కించుకోవడానికి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. అలా ఇప్పటికే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో భాగ్యం పాత్ర పోషించి, ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.. ముఖ్యంగా ఆ పాత్రలో ఐశ్వర్య తప్ప మరొకరు నటించలేరు అనే రేంజ్ లో కామెంట్లు వ్యక్తమయ్యాయి.

మళ్ళీ సంక్రాంతి పై ఐశ్వర్య రాజేష్ ఫోకస్..

అలా ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత చేసిన మరే సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈమె చేసిన చిత్రం ‘ఇసకపట్నం’. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో గుర్తింపును అందించలేదు. ఇక రీసెంట్గా వచ్చిన మరో మూవీ ‘ఓ సుకుమారి’.. ఈ సినిమా కూడా పెద్దగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న విషయం తెలిసిందే.

రవితేజ సరసన హీరోయిన్గా అవకాశం..

Advertisement

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతోంది. ‘రాజరాజ చోర’ మూవీ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ఇటీవల ఇరుముడితో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ (Raviteja) ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు..

also read: బుల్లితెరపై లెనిన్ సినిమా ఎప్పుడంటే?

సినిమా హిట్ అయితే.. తెరపైకి కొత్త సెంటిమెంట్..

Advertisement

ఇకపోతే త్వరలోనే ఈ సినిమాను సెట్ పైకి తీసుకురాబోతున్నారు. రికార్డ్ టైం లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి సందర్భంగా 2027 జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇక సంక్రాంతి సినిమా కావడంతో అటు ఐశ్వర్య కూడా మంచి ఉత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అయితే ఈమె ఖాతాలో పడలేదు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి తన కొత్త సినిమా విడుదల కాబోతోంది అని ప్రకటించడంతో.. ఆ సినిమా పైన ఐశ్వర్య రాజేష్ ఆశలు పెట్టుకుంది. పైగా ఈసారి హిట్ హీరో సరసన అవకాశం అందుకుంది. కాబట్టి మళ్లీ సంక్రాంతికి ఈమెకి కలిసొచ్చినట్లే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగా ఐశ్వర్య గనుక వచ్చే సంక్రాంతికి దాగుడుమూతలు దండాకోర్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే మాత్రం.. ఐశ్వర్య రాజేష్ కి సంక్రాంతి బాగా కలిసొస్తుంది అనే సెంటిమెంట్ తన పైకి వస్తుందనటంలో సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం..

Related News

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ ప్రయత్నం వృధా అయ్యిందా..? ఆ ఒక్కటే మిస్టేక్ నా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

టాక్సిక్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంతో తెలుసా ?

Big Stories

Advertisement
×