Oh Sukumari: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మళ్లీ మరో తెలుగు సినిమా ప్రకటించలేదు. కానీ ఏడాది గ్యాప్ తీసుకొని ఓ..! సుకుమారి అనే టైటిల్ తో గ్రాండ్ గా థియేటర్లలో కి రావడానికి సిద్ధమైంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా, మసూద్ సినిమాతో మంచి విజయం అందుకున్న తిరు వీర్ హీరోగా నటిస్తున్న ఈ రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి భరత్ దర్శన్ రచన, దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. హిట్ మిషన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
తాజాగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ విషయానికి వస్తే.. దామిని(ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయికి వింత సమస్య ఉంటుంది. ఆ సమస్య తెలుసుకొని ఊరంతా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంటు షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకి హీరోతో పెళ్లి చేస్తారు. ఇక పెళ్లి జరిగిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సమస్యను కలిసి భార్యాభర్తలు ఎలా ఎదుర్కొన్నారు? చివరికి వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటు చేసుకున్నాయి? అనేది ఈ సినిమా ప్రధాన అంశం . ఇక తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను కలగలిపిన వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాపై అంచనాలను పెంచేసింది.
also read:మళ్లీ వచ్చాడ్రోయ్.. డై హార్ట్ ఫ్యాన్ హంగామా.. అఖిల్ ఏం చేశారంటే?
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లోనే సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. జూలై 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు . కేవలం తెలుగులోనే కాకుండా ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ్ , మలయాళం భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు .ఇక ఇందులో ఝాన్సీ, ఆనంద్, అంజి మామ, శివానంద్ , కోట జయరాం, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇకపోతే హోమ్లీ క్యారెక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఒకవైపు కామెడీ పండిస్తూనే.. మరొకవైపు గృహిణిగా ఆకట్టుకున్న ఈమె.. ఆపద వచ్చినప్పుడు రుద్రకాళిలా మారి తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అబ్బురపరిచింది. మొత్తానికైతే ఈ సినిమాతో ఐశ్వర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.