E-Paper
Advertisement

మళ్లీ వచ్చాడ్రోయ్.. డై హార్ట్ ఫ్యాన్ హంగామా.. అఖిల్ ఏం చేశారంటే?

మళ్లీ వచ్చాడ్రోయ్.. డై హార్ట్ ఫ్యాన్ హంగామా.. అఖిల్ ఏం చేశారంటే?
Advertisement

Akhil: అభిమాన హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు.. వారి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అభిమానుల హడావిడితోనే సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే అందులో మరీ ముఖ్యంగా కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలైనప్పుడు “అయ్యగారే నెంబర్ వన్.. అయ్యగారు వస్తారు.. అయ్యగారే కరెక్ట్” అనే డైలాగ్ తో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న అఖిల్ డైహార్ట్ ఫ్యాన్ ఇప్పుడు మళ్లీ లెనిన్ సినిమా రిలీజ్ సమయంలో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

అఖిల్ కోసం మళ్లీ వచ్చిన వీరాభిమాని..

అప్పుడు అలాంటి డైలాగులతో ఊగిపోయిన ఈయన.. ఇప్పుడు మరో కొత్త డైలాగులతో థియేటర్ వద్ద సందడి చేస్తుంటే.. అది చూసిన నెటిజన్స్ మాత్రం మళ్లీ వచ్చాడ్రోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. థియేటర్ వద్ద ఆ అభిమాని చేసిన హంగామా చూసిన అఖిల్ రియాక్షన్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అభిమాన హీరో కటౌట్ కి దిష్టి..

Advertisement

అఖిల్ తాజాగా నటించిన చిత్రం లెనిన్.. ఈ సినిమా హిట్ కోసం అఖిల్ ఎంతగా తపించాడో.. కష్టపడ్డాడో అందరూ చూశారు. ఇక ఆయన కష్టాన్ని గుర్తించి బూస్టింగ్ ఇవ్వడానికి అఖిల్ పాత వీరాభిమాని మళ్లీ థియేటర్ ముందుకి వచ్చాడు. సోషల్ మీడియాలో అయ్యగారే నంబర్ వన్ అంటూ ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అభిమాని ఇప్పుడు లెనిన్ సినిమా ఆడుతున్న థియేటర్ వద్దకు చేరుకొని.. తన ప్రాణప్రదమైన హీరో అఖిల్ కటౌట్ కి పెద్ద పూలమాలవేసి ..గుమ్మడికాయతో దిష్టి కూడా తీశాడు. అంతేకాదు మీడియాతో మాట్లాడుతూ తన పాత స్టైల్ లో అఖిల్ కి అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చారు. ఈ సినిమా కోసం అఖిల్ ను, చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని కొనియాడుతూ సినిమాపై మరింత అటెన్షన్ క్రియేట్ చేశాడు.

అభిమాని అభిమానానికి హీరో ఫిదా..

అలా తన అభిమాని థియేటర్ ముందు తన కటౌట్ కి పూలమాలవేసి గుమ్మడికాయతో దిష్టితీస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన అఖిల్ మురిసిపోతూ తెగ నవ్వుకున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఏది ఏమైనా అప్పుడప్పుడు అభిమానులు చేసే ఇలాంటి పనులు..హీరోలకు పూర్తిస్థాయిలో ధైర్యాన్ని, స్వాంతనను కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అభిమానిపై ప్రశంసలు..

Advertisement

ఇకపోతే గత ఇంటర్వ్యూలలో అఖిల్ కష్టాన్ని చూసిన ఆయన అభిమాని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని తన హీరోకి కెరియర్ లో అత్యంత కీలకమైన సమయంలో తోడుగా నిలబడడానికి మళ్లీ వచ్చేసాడు. ఏది ఏమైనా తన అభిమాన హీరోని గెలిపించుకోవడానికి ఆ అభిమాని పడుతున్న తపన చూసి నెటిజన్లు ముచ్చట పడుతూ అభిమాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

శ్రీలీలతో విభేదాలపై స్పందించిన నిర్మాత.. మరీ ఇంత దారుణమా?

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ ఓ..! సుకుమారి ట్రైలర్ రిలీజ్.. విడుదల ఎప్పుడంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు చెళియన్ కన్నుమూత

కథలో ముద్దు సీన్లు ఉంటే నన్ను తీసేయండి.. ‘సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఢిల్లీ టు స్వీడన్.. సైకిల్‌పైనే 9,600 కిలోమీటర్లు! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లవ్ స్టోరీ!

తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

తండ్రిని పట్టుకొని ఏడ్చేసిన అఖిల్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×