E-Paper
Advertisement

Aishwarya Rajinikanth: స్టార్ దర్శకుడిపై సూపర్ స్టార్ కూతురు సెన్సేషనల్ కామెంట్స్..!

Aishwarya Rajinikanth: స్టార్ దర్శకుడిపై సూపర్ స్టార్ కూతురు సెన్సేషనల్ కామెంట్స్..!
Advertisement

Aishwarya Rajinikanth: కోలీవుడ్‌లో మరోసారి పెద్ద చర్చకు కారణమయ్యారు సౌందర్య రజనీకాంత్. చాలా కాలం తర్వాత నిర్మాతగా తిరిగి వస్తున్న ఆమె, తన కొత్త సినిమా విత్ లవ్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తన తండ్రి రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ గురించి ఆమె మాట్లాడిన తీరు అభిమానుల్లో చర్చకు దారి తీసింది.

ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడుతూ, కూలీ సినిమాలోని 10 నిమిషాల డీ-ఏజింగ్ సీక్వెన్స్ తనకు చాలా నచ్చిందని చెప్పారు. టెక్నాలజీ పరంగా ఆ సన్నివేశం అద్భుతంగా ఉందని ఆమె ప్రశంసించారు. అయితే తాను ఒక హార్డ్‌కోర్ తలైవర్ అభిమానిని అయినప్పటికీ, ఈ సినిమా తన తండ్రి బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా అనిపించలేదని స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకుడిగా ఇంకా ఎక్కువ ఆశించానని ఆమె అన్నారు.

Advertisement

ఇంకా మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎక్కువ హింసను ఇష్టపడుతున్నట్లు తనకు అనిపిస్తోందని సౌందర్య అభిప్రాయపడ్డారు. అయితే కూలీ సినిమా గురించి ఎక్కువగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఇప్పటికే బలమైన సినిమాలు అందించారని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. చాలామంది నెటిజన్లు, సౌందర్యకు సినిమా పూర్తిగా నచ్చలేదని, కానీ బహిరంగంగా నేరుగా చెప్పకుండా మాటలను మృదువుగా చెప్పారని అభిప్రాయపడ్డారు. డీ-ఏజింగ్ సీన్ తప్ప మిగతా సినిమా ఆమెను ఆకట్టుకోలేదని వారు భావిస్తున్నారు.

Advertisement

మరికొందరు అభిమానులు మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పలు ఇంటర్వ్యూలలో కూలీ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఎక్కువగా మాట్లాడారని..కానీ సౌందర్య వ్యాఖ్యలు చూస్తే సినిమా రజనీకాంత్ కుటుంబాన్ని కూడా.. పూర్తిగా ఇంప్రెస్ చేయలేదని వారు అంటున్నారు.

హార్డ్‌కోర్ రజనీకాంత్ అభిమానుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీ-ఏజింగ్ సీక్వెన్స్ తప్ప మిగతా భాగాలు అంచనాలకు తగ్గట్టు లేవని వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి, సౌందర్య రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అభిమానులు..సినీ ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఈ అంశాన్ని కోలీవుడ్‌లో పెద్ద చర్చగా మార్చేశారు.

ALSO READ: Dhurandhar: మొత్తం 7 దేశాల్లో సత్తా చాటుతున్న ధురంధర్.. ఆ రికార్డ్స్ అన్నీ మాయం!

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×