BigTV English

Sivakarthikeyan : శివకార్తికేయన్ హీరో కాకుంటే ఏమైయ్యేవారో తెలుసా..? అస్సలు ఊహించలేదు..

Sivakarthikeyan : శివకార్తికేయన్ హీరో కాకుంటే ఏమైయ్యేవారో తెలుసా..? అస్సలు ఊహించలేదు..

Sivakarthikeyan : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది.. రీసెంట్ గా ఈ హీరో నటించిన అమరన్ చిత్రం తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఆ మూవీ తర్వాత ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం మదరాసి.. సెప్టెంబర్ 5 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఈవెంట్ లో  తన డ్రీమ్ బయటపెట్టిన హీరో..

ఏఆర్ మురగాదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం మదరాసి.. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించారు. ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడిన మాటలు ఈవెంట్ కి హైలైట్ గా నిలిచాయి. కేవలం సినిమా గురించి మాత్రమే కాదు తన పర్సనల్ విషయాలు గురించి కూడా పంచుకున్నారు.. ఈయన సినిమాల్లోకి రాకుంటే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. మా నాన్న పోలీసు ఆయన కంటే ఎక్కువ స్థానంలో ఉండాలని అనుకున్నాను. కానీ అనుకొని విధంగా ఇలాగా సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డాను అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది..


Also Read : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెట్టేది అందుకేనా..?

హీరో విజయ్ పై షాకింగ్ కామెంట్స్.. 

యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారిన ఈయన. హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈయన నటించిన చివరి చిత్రం అమరన్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నారు.. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ దళపతి తో శివ కార్తికేయను చాలామంది పోల్చేవారు.. ఈ ఈవెంట్ లో దీని గురించి ఆయన మాట్లాడారు.. హీరో విజయ్ నాకు అన్న తో సమానం.. అన్న అన్నే తమ్ముడు తమ్ముడే అని శివ కార్తికేయన్ అన్నారు. మురగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఎలాంటి టాక్ని మూవీ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related News

Anushka Shetty: ఇకనుంచి కనిపిస్తాను.. మాటచ్చిన జేజమ్మ

Allu Arjun: దుఃఖాన్ని దిగమింగుకొని సెట్ లో పాల్గొన్న బన్నీ.. నీ డెడికేషన్ కి ఫిదా సామీ!

Pawan Vs Balayya: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ పదవి.. పవన్ కే ఎదురుతిరిగిన బాలయ్య ?

Nara Brahmani: అఖండ 2 మీ వల్లే ఆలస్యం.. తమన్ పై బ్రాహ్మణి ఊహించని కామెంట్స్!

Actor Ranjith: విజయ్ ఎదురుగా వస్తే ముఖం పగలకొడతాను..

Big Stories

×