BigTV English

Akhil Akkineni: పెళ్లి తరువాత అయ్యగారు జోరు పెంచారు.. హనీమూన్ కూడా వదిలేసి ?

Akhil Akkineni: పెళ్లి తరువాత అయ్యగారు జోరు పెంచారు.. హనీమూన్ కూడా వదిలేసి ?

Akhil Akkineni: గత కొన్నేళ్లుగా అఖిల్ అక్కినేని మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటాడు అని అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అఖిల్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు చేశాడు. అందులో ఒక్క సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడుతాడేమోనని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. కానీ, అది కూడా జరగలేదు.


 

ఇక ఎప్పటికో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఒక విజయాన్ని అందుకున్నాడు అఖిల్. సరే ఈ సినిమా తర్వాత అయినా ఆ విజయాన్ని కొనసాగిస్తాడేమో అని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూశారు. ఆ సినిమా తరువాత  అఖిల్ సైతం చాలా ఏళ్లు కష్టపడి ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా అనగానే భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అఖిల్ కు ఇక అసలు సినిమాలే సెట్ కావు. ఇండస్ట్రీని వదిలేసి క్రికెట్ లో  కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు సలహా కూడా ఇచ్చారు. కానీ అఖిల్ మాత్రం పోగొట్టుకున్న చోటే నిలబడాలి అని లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


 

కిరణ్ అబ్బవరంకు మినరో భాగ్యము విష్ణు కథ లాంటి మంచి విజయాన్ని అందించిన మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ తెరకెక్కుతుంది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రంలో మొదట శ్రీలీలను అనుకున్నా ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్  ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

మునుపెన్నడూ చూడని విధంగా అఖిల్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. పరువు హత్యలు నేపథ్యంలో లెనిన్ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అఖిల్ ఒక ఇంటి వాడయ్యాడు. జూన్ 6న జైనబ్ తో అఖిల్ వివాహం చాలా సింపుల్ గా  జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తారని వార్తలు వచ్చాయి. దీంతో లెనిన్ షూటింగ్ అఖిల్ లేకుండానే చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

 

ఎంత లేదనుకున్నా  కనీసంలో కనీసం ఒక నెల రోజులు లెనిన్ షూటింగ్ కు బ్రేక్ పడుతుందేమో అని అనుకున్నారు. కానీ అఖిల్ మాత్రం హనీమూన్ ను పక్కనపెట్టి లెనిన్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడట.  ముందుగా అఖిల్ సన్నివేశాలను చిత్రీకరించి త్వరగా ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారటమేకర్స్ . హనీమూన్ కన్నా షూటింగ్ ముఖ్యమని అయ్యగారు లెనిన్ మీదే ఫోకస్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ ఆ లెవెల్ డెడికేషన్ కు మురిసిపోతున్నారు. మరి ఇంత కష్టపడుతున్న ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Kalki 2: కర్ణ 3102 బీసీలో మొదటి ప్రాముఖ్యత ఎవరికి.. క్రేజీ న్యూస్ వైరల్!

Upcoming Movies Theater : అక్టోబర్ లో రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్న సినిమాలు..

Actress Hema: ఆ క్షణం ఎవరినైనా చంపేయాలనిపించేది..ఎమోషనల్ అయిన హేమ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?

OG 2: పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజి 2లో అకీరా .. థియేటర్లు తగలబడి పోవాల్సిందే!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్‌!

Samantha: ఫైనల్లీ కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. త్వరలోనే షూటింగ్ అంటూ!

Vijay Devarakonda: నిశ్చితార్థం తరువాత ఫేవరెట్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ.. ప్రత్యేకం ఏంటబ్బా!

Big Stories

×