BigTV English

War 2: మరోసారి ఎన్టీఆర్ కు అవమానం.. మొన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు వార్ 2.. మరీ ఇంత నీచమా ?

War 2: మరోసారి ఎన్టీఆర్ కు అవమానం.. మొన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు వార్ 2.. మరీ ఇంత నీచమా ?

War 2: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకొని రాజమౌళి సెంటిమెంట్ న బ్రేక్ చేసి రికార్డ్ సృష్టించాడు ఎన్టీఆర్.  ఇక ఈ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం వార్ 2. ఎప్పటినుంచో ఎన్టీఆర్ బాలీవుడ్ లో బాగా వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు అనే మాట వాస్తవం. కాకపోతే పాన్ ఇండియా అనే గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పావులను కదిపి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి మొత్తం సిద్ధం చేశాడు.


 

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే  వార్ 2  నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్  ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాట భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక వార్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒకటే భయం. ఎక్కడ ఎన్టీఆర్ ను మళ్లీ తక్కువచేసి చూపిస్తారనో.. లేక ఎక్కువ సేపు ఉంచరేమో అనే అనుమానం వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు.


 

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజమౌళి.. చరణ్ కు న్యాయం చేసి ఎన్టీఆర్ ను అన్యాయం చేశాడని, చరణ్ పాత్రను హైలైట్ చేసి ఎన్టీఆర్ పాత్రను తేల్చేశాడని, నిడివి విషయంలో కూడా చరణ్ ఎక్కువ కనిపించాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన విషయం తెల్సింద. దీంతో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్.. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ అని, హీరో కేవలం రామ్ చరణ్ అని ట్రోల్ చేశారు. దీనివలన చరణ్- ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం కూడా పోయిందని వార్తలు కూడా వచ్చాయి.

 

ఆర్ఆర్ఆర్ లానే వార్ 2 లో కూడా హృతిక్ రోషన్ ను హైలైట్ చేయడం కోసం ఎన్టీఆర్ ను వాడుకోరు కదా అని భయపడుతున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ భయమే నిజమైందని తెలుస్తోంది. వార్ 2 సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఇందులో హృతిక్ – ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారని, డ్యాన్స్ ల్లో కానీ, యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇద్దరినీ తీసిపడేయడానికి కూడా ఏది లేదని సమాచారం.అయితే ఒకింత హృతిక్ కన్నా ఎన్టీఆర్ నే ఎక్కువ డామినేట్ చేశాడని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

 

ఇక హృతిక్ ను ఎన్టీఆర్ డామినేట్ చేయడం నచ్చని మేకర్స్.. ఎన్టీఆర్ సీన్ ను కొన్ని కట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఏదైతే జరగకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడ్డారో.. ఇప్పుడు అదే జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నారు. అసలు మా హీరో సీన్స్. ఎలా కట్ చేస్తారు అని ఫైర్ అవుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే.. ఎన్టీఆర్ పై హైప్ తీసుకురావడానికి ఫ్యాన్స్ నే ఈ వార్తను పుట్టించారని ఇంకోమాట వినిపిస్తుంది. లేకపోతే హృతిక్ ను ఎన్టీఆర్ డామినేట్ చేయడం ఏంటి కామెడీ కాకపోతే అని జోకులు వేస్తున్నారు. కానీ, ఏదిఏమైనా ఇలా సీన్స్ కట్ చేయడం అన్నది కచ్చితంగా ఎన్టీఆర్ కి అవమానమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

 

ఆర్ఆర్ఆర్ లో ఏమో అలా చేసి.. ఇప్పుడు వార్ 2 లో ఏకంగా సీన్స్ కట్ చేయడం అనేది ఎంతో అవమానమని , బాలీవుడ్ వాళ్లు మరీ ఇంత నీచానికి దిగజారతారా.. ? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగక తప్పదు. ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపు సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ ఆగుతారో లేదో చూడాలి.

Related News

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Tollywood cineworkers: ముగిసిన సినీ కార్మికుల సమ్మె, కాసేపట్లో ప్రెస్ మీట్

Mega 157 Glimpse: మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, టీజర్ అదిరింది. అసలైన మెగా ట్రీట్

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Big Stories

×