Akshay Kumar: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు ఇండియాలో బహిరంగంగా తిరగాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు బయట కనపడితే అభిమానులు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే విదేశాలకు వెళ్లి సెలబ్రిటీలు అక్కడ స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు విదేశాలలో కూడా అభిమానులు సెలబ్రిటీలను గుర్తుపట్టి కాస్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) కి కూడా ఎదురయింది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం లండన్ (Landon)పర్యటనలో ఉన్నారు.
అక్షయ్ కుమార్ తో సెల్ఫీ..
ఇలా లండన్ పర్యటనలో భాగంగా ఈయన లండన్ వీధులలో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. అయితే అక్షయ్ కుమార్ ను గుర్తించిన ఒక అభిమాని వెంటనే తన మొబైల్లో ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విషయాన్ని అక్షయ్ కుమార్ గమనించారు. దీంతో వెంటనే అభిమాని ఫోన్ లాక్కొని అభిమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇలా ఫోటోలు వీడియోలు తీయడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి ఆ అభిమానితో కలిసి అక్షయ్ కుమార్ సెల్ఫీకి ఫోజులిచ్చినట్టు ఈ వీడియోలో స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అనుమతి లేకుండా ఫోటోలు తీయడం..
ఈ వీడియోలో, అక్షయ్ కుమార్ చార్‌కోల్ గ్రే ట్యాంక్ టాప్, దానికి సరిపోయే షార్ట్స్ మరియు బీనీ ధరించి కనిపించారు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారడంతో అక్షయ్ కుమార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఇంతలా బాధపడటం ఎప్పుడూ చూడలేదు అంటూ కొందరు కామెంట్లు చేయగా.. “థోడా ప్రైవసీ దే దో భాయ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఎప్పుడూ కూడా ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు.
?igsh=eHRieW0ycHJ2MnU3
ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల హౌస్ ఫుల్ 5 (House Full 5)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే భూత్ బంగ్లా, వెల్కమ్ టు ది జంగిల్, జాలీ ఎల్‌ఎల్‌బి 3, హైవాన్ వంటి ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. హైవాన్ సినిమా అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాని ప్రకటించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా క్యామియో పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల మంచు విష్ణు నటించిన కన్నప్ప (Kannappa)సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్టులతో అక్షయ్ కుమార్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన హీరో అజిత్… ఆందోళనలో అభిమానులు!