E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

దీపికా ప్లేస్‌లో ఆలియా భట్.. రెబల్ స్టార్ హింట్ ఇచ్చేశాడా?

దీపికా ప్లేస్‌లో ఆలియా భట్.. రెబల్ స్టార్ హింట్ ఇచ్చేశాడా?
Advertisement

Kalki 2: ప్రభాస్ …తెలుగు సినిమా ..కాదు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని శాసిస్తున్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా రెబల్ స్టార్. ఏ ముహూర్తాన బాహుబలి అంటూ జక్కన్న చేతిలో పడ్డాడో కాని అప్పటి నుండి వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో టాప్ లీగ్ లోకి చేరిపోయాడు.

ఇక అదే ఊపుని కంటిన్యూ చేస్తూ స్పిరిట్, ‘కల్కి2’ఫౌజి వంటి బ్యాక్-టు-బ్యాక్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్లని లైనప్ చేసేశాడు.అయితే వీటిలో కల్కి 2898 ఏడీలో నటించిన దీపికా పదుకునే సీక్వెల్ లో కంటిన్యూ కావడం లేదని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా దీపిక చేసిన ఆ సుమతి పాత్రలో కనిపించే హీరోయిన్ ఎవరా అంటూ గత కొద్ది రోజులుగా ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.

ఆలియా భట్ సినిమాకి విషెస్ చెప్పిన ప్రభాస్ 

Advertisement

ఇక ఈ పాత్రకి ఎంతో మందిని అనుకున్నప్పటికీ చివరికి సాయి పల్లవిని కన్ఫాం చేసేశారని,ఇక మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే మిగిలిఉందని ఊదరగొట్టారు నెటిజన్లు.కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అదంతా అబద్దమని తెలుస్తుంది.కారణం ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సినిమాకి విషెస్ చెప్పడమే.

అవును…ఆలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ (Alpha) రాబోయే జూలై 3నవిడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ షేర్ చేస్తూ.. “ఆల్ఫా ట్రైలర్ అమేజింగ్‌గా ఉంది. ఆలియా భట్, వైఆర్ఎఫ్ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్” అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.దీనికి అలియా భట్ రియాక్ట్ అవుతూ “థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఆ స్టోరీని రీ-షేర్ చేసింది.

డార్లింగ్ హిందీ సినిమాలకి పోస్ట్ పెట్టడం రేర్

Advertisement

మాములుగా డార్లింగ్ ఇలా హిందీ సినిమాల ప్రమోషన్స్ కి బూస్టప్ ఇస్తూ ఇలా పోస్ట్ పెట్టడం చాలా రేర్.ఇలా ఏరి కోరి మరి అలియ భట్ సినిమా ట్రైలర్ ని డార్లింగ్ షేర్ చేయడంతో అలియా కల్కి 2898 ఏడీలో దీపికా పదుకునే పాత్రని రీప్లేస్ చేయబోతుందని,అందుకే ప్రభాస్ ఇలా షేర్ చేస్తూ విషెస్ చెప్పడంటూ లాజిక్స్ తీస్తున్నారు మూవీ లవర్స్.అయితే గతంలోనూ అలియా కల్కి సీక్వెల్ లో నటిస్తుందన్న వార్తలకి ఎండ్ కార్డ్ వేస్తూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.కాని ఇపుడు దీపిక ని రీప్లేస్ చేయాలంటే అది అలియాకే సాధ్యమని, అందుకే నాగ్ అశ్విన్ అలియాని ఆన్ బోర్డ్ చేశాడన్న టాక్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా ఎన్ని గాసిప్స్ సర్క్యులేట్ అయినా అటు ప్రభాస్ టీమ్ కానీ, ఇటు వైజయంతీ మూవీస్ కానీ దీనిపై సరైన అప్ డేట్ వదిలితే కాని క్లారిటీ వచ్చేలా లేదు, చూడాలి త్వరలో అయినా దీని పై ఏమైనా అనౌన్స్మెంట్ వదులుతారేమో !

also read:పెద్ది ఓటీటీ ఫ్యాన్స్‌కి షాక్.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ మారబోతుందా?

Related News

అఖిల్ రాజ్ తప్పు లేదు.. నా బర్త్‌డే రోజే ఆ వీడియో తీసి బుక్కయ్యా: డెలివరీ బాయ్ కామెంట్స్ వైరల్!

Rao Bahadur:ఆ హీరోలే రోల్ మోడల్.. ‘రావు బహదూర్’ విశేషాలు పంచుకున్న సత్యదేవ్!

రావు సాహెబ్ నటి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న అనుపమ్ ఖేర్!

పెద్ది ఓటీటీ ఫ్యాన్స్‌కి షాక్.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ మారబోతుందా?

‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!

స్పైడర్ మ్యాన్ తాజా ప్రోమోలో మెస్సీ.. 20 సెకన్ల యాక్టింగ్‌కు ఎన్ని కోట్లో తెలుసా ?

ఆదర్శ కుటుంబం కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..గూస్ బంప్స్ గ్యారెంటీ!

Big Stories

×