E-Paper
Advertisement

నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?

నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?
Advertisement

Alias Rukmini Movie:దండోరా సినిమాతో సత్తా చాటిన మురళి కాంత్ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’.నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని అక్క అయిన దీప్తి నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అసలు రుక్మిణి ఎవరు? నితిన్ భార్యగా కనిపించబోయే ఆ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నలు ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచేశాయి .

అప్పటి నుండే ఆరాలు

Advertisement

గత కొన్ని రోజుల కిందట రిలీజ్ అయిన గ్లింప్స్‌లో నాని దర్శకుడు మురళి కాంత్ ని కథ ఎవరి గురించి అని అడగడం,దానికి మురళి కృష్ణ అనే వ్యక్తి గురించి చెబుతున్నానని చెప్పడం మనకి తెల్సిందే. ముఖ్యంగా ఆ వీడియోలో కనిపించే కొన్ని పుస్తకాలు అయిన ‘గరం గోపాల్’, ‘ఆమెకు ఆమె అంటే ఇష్టం’, ‘వ్రతం వెంకన్న’ వంటి పేర్లతో ఉన్న ఆ పుస్తకాలపై రుక్మిణి అనే పేరు కనిపిస్తుంది దీంతో అసలు ఈ రుక్మిణి ఎవరు? అంటూ అప్పటి నుండే ఆరాలు తీయడం మొదలెట్టారు ఫ్యాన్స్.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆఫియా సయ్యద్

Advertisement

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం హిందీ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆఫియా సయ్యద్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ బ్యూటీ విషయానికి వస్తే హిందీలో రీమేక్ అయిన ప్రేమలు సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది,ముఖ్యంగా వీర్ పహారియా తో ఈ భామ పండించిన కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ .అయితే మరి వినిపిస్తున్నట్టుగా నిజంగానే ఈ భామ నటిస్తుందా లేక కేవలం గాసిప్స్ మాత్రమేనా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కాని తెలిసేలా లేదు.

వరుస ఆరు సినిమాలు డిజాస్టర్ టాక్

ఇక నితిన్ కెరీర్‌ విషయానికి వస్తే‘దిల్’, ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘అ ఆ’, ‘భీష్మ’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక డీలా పడిపోయాడు.ఒకటి రెండు కాదు చెక్ ,రంగ్ దే ,మ్యాస్ట్రో మాచర్ల నియోజకవర్గం, తమ్ముడు ,రాబిన్ హుడ్ , ఎక్సట్రార్దినరీ మాన్ అంటూ ఏకంగా వరుస ఆరు సినిమాలు డిజాస్టర్ టాక్ మూట గట్టుకోవడంతో ఇప్పుడు వస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఆఫియా సయ్యదా లేక మరో పేరు రివీల్ అవుతుందా

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ..ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం, జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 4, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా. ఇక మేకర్స్ అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన డీటైల్స్ రివీల్ చేస్తామని చెప్పారు.మరి ఆఫియా సయ్యద్ బయటికి వస్తుందా లేక మరో పేరు రివీల్ అవుతుందా చూడాలి !

ALSO READ :అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!

Tags

Related News

నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!

నవరాత్రి స్పెషల్.. ‘భరత వర్ష’ నుండి “అమ్మ కదిలి వచ్చే” సాంగ్ ప్రోమో రిలీజ్!

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!

సింగర్ గా ఛాన్స్ కొట్టేసిన జిమ్ జిమ్ తార ఫేమ్ ఆంటీ …

Big Stories

Advertisement
×