E-Paper
Advertisement

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన కేంద్రం.. కానీ ఆ చిన్న తప్పుతో అంతా జీరో..?

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన కేంద్రం.. కానీ ఆ చిన్న తప్పుతో అంతా జీరో..?
Advertisement

Charlapalli Terminal: హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించింది కేంద్రప్రభుత్వం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 413 కోట్లతో తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో నాలుగో పెద్ద రైల్వే స్టేషన్ గా 2005 జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ… ఇక్కడకు వెళ్లే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిటీ శివారు ప్రాంతంలో ఉన్న చర్లపల్లి టెర్మినల్ కు వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.

రోజూ 20 వేల మందికి పైగా ప్రయాణం..

చర్లపల్లి కి MMTS సర్వీసులు ఎక్కువ లేక పోవడంతో బస్సులు, క్యాబ్ లపైనే ఆధారపడుతున్నారు ప్రయాణికులు. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి చర్లపల్లి కి మరిన్ని MMTSలు నడపాలని కోరుతున్నారు. స్టేషన్ కు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి నుంచి 12 నుంచి 14 రెగ్యులర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 52 రైళ్లకి పైగా ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఈ స్టేషన్‌ నుంచి రోజూ 20 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. అయినా సరే సిటీ నుంచి సరైన కనెక్టివిటీ ఇప్పటి లేదు. సమీపంలో మెట్రో కనెక్టివిటీ కూడా లేకపోవడం ఇంకో సమస్య. చర్లపల్లి స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులు క్యాబ్‌లు, లేదంటే ఆర్టీసీ బస్సుల పైనే ఆధారపడాల్సి వస్తోంది.

సరిపోనీ రైళ్లు..

Advertisement

చర్లపల్లి టెర్మినల్‌తో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల ఒత్తిడి తగ్గింది. అయితే ప్రయాణికుల భారాన్ని కూడా అధికారుల తగ్గించాల్సి ఉంది. ఇక్కడి నుంచి మల్లీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ సేవలు కల్పించాలని అంతా కోరుతున్నారు. ప్రస్తుతం లింగంపల్లికి రెండు MMTS రైళ్లు నడుస్తున్నాయి. ఘట్‌కేసర్‌కు రెండు రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఇవి ప్రయాణికులకు సరిపోవడం వీటి సంఖ్యను సమయానుకూలంగా పెంచాలంటున్నారు ప్రయాణికులు.

Also read: పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

Tags

Related News

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×