E-Paper
Advertisement

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Comedy Drama OTT : ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్లకు పరిచయం చేయాలంటే ధైర్యం కావాలి. కానీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు ఆమెను ప్రేయసిగా కాకుండా ఇంటి పని మనిషిగా పరిచయం చేయాల్సి వస్తే ? అక్కడితో సమస్య ముగియదు. అదే అమ్మాయిని మరో వ్యక్తి పెళ్లి చేసుకోవాలని పట్టుబడితే, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి గందరగోళంతో నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ ‘మేరీ గర్ల్‌ఫ్రెండ్ దా వియాహ్’ (Meri Girlfriend Da Viyaah). మరి కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో చూడొచ్చా ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

బిట్టు ముంబైలో తన ప్రేయసి నిమ్రత్ తో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం అతడికి ఉండదు. ఇంతలో బిట్టు తల్లిదండ్రులు అనుకోకుండా ఇంటికి వస్తారు. ప్రేయసితో కలిసి ఉంటున్నానని చెప్పడానికి ఇబ్బంది పడిన బిట్టు, నిమ్రత్‌ ను తన ఇంట్లో పని చేసే పని మనిషిగా పరిచయం చేస్తాడు. ఆ ఒక్క అబద్ధంతో పరిస్థితి సర్దుకుంటుందని భావిస్తాడు. కానీ అక్కడి నుంచే అసలు గందరగోళం మొదలవుతుంది.

Advertisement

ఇంట్లో వాళ్లకు నిజం తెలియకుండా ఉండాలంటే బిట్టు, నిమ్రత్ ఇద్దరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడుగుతారో, తమ మాటల్లో ఏ చిన్న తేడా కనిపిస్తుందోనని ఇద్దరూ ఆందోళన చెందుతుంటారు. ఈలోగా ఇంట్లో పని చేసే మరో హెల్పర్ నిమ్రత్‌ ను ఇష్టపడటం మొదలుపెడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. దీంతో బిట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. తన ప్రేయసిని పని మనిషిగా పరిచయం చేసిన అబద్ధం ఒకవైపు ఉంటే, ఆమెను పెళ్లి చేసుకోవాలని మరో వ్యక్తి ముందుకు రావడం మరోవైపు సమస్యగా మారుతుంది.

నిజం బయటపడకుండా ఉండేందుకు బిట్టు చేసే ప్రయత్నాలు, నిమ్రత్ ఎదుర్కొనే ఇబ్బందులు, కుటుంబ సభ్యుల ప్రశ్నలు కథలో కామెడీకి దారితీస్తాయి. అతనికి ప్రేమించిన వ్యక్తితో తన సంబంధాన్ని దాచి పెట్టడం ఎంతకాలం సాధ్యం అవుతుంది ? నిమ్రత్‌ ను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి బిట్టు ఏం సమాధానం చెబుతాడు ? తల్లిదండ్రులకు నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

స్మీప్ కాంగ్ (Smeep Kang) దర్శకత్వం వహించిన ఈ పంజాబీ కామెడీ డ్రామాలో స్మీప్ కాంగ్, కైరవ్ కాంగ్ (Kairav Kang), జ్యోతి అరోరా (Jyoti Arora), మన్నత్ సింగ్ (Mannat Singh) నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి చౌపాల్ (Chaupal)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రేమకథల్లో అపార్థాలు, కుటుంబ గందరగోళం, సరదా సంఘటనలు ఇష్టపడేవారికి ఇది మంచి వినోదాన్ని అందించవచ్చు. అయితే ఈ పంజాబీ డ్రామా తెలుగులో మాత్రం లేదు.

Tags

Related News

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×