E-Paper
Advertisement

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!
Advertisement

Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. ముఖ్యంగా ఫోర్బ్స్ ఇండియా (Forbs india) తాజా సంచిక కవర్ పేజ్ పై స్థానం సంపాదించుకోవడం ఆయన క్రేజ్ కి నిదర్శనం. ఫోర్క్స్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన ‘షో స్టాపర్స్ ‘ ఎడిషన్ లో భాగంగా సినిమా, టెలివిజన్ ,క్రీడలు, సంగీతం, కళలు , ఫ్యాషన్ ఇలా తదితర రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పుడు స్థానం కల్పించారు. అందులో భాగంగానే ఏకంగా కవర్ పేజి పై ఆయన దర్శనం ఇవ్వడం అభిమానులను ఆనందోత్సాహానికి గురిచేసింది..

ఫోర్బ్స్ కవర్ పేజ్ పై అల్లు అర్జున్..

ఇకపోతే తాజాగా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్లో భాగంగా అథ్లెట్స్ , కాస్టింగ్ డైరెక్టర్స్, టీవీ పర్సనాలిటీస్, టాప్ యాక్టర్స్, సింగర్స్, డిజైనర్స్, ఆర్టిస్ట్స్ , కమెడియన్స్ ఇలా ఎంతోమంది తమ అనుభవాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, బ్రాండ్ బిల్డింగ్ జర్నీ, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏ విధంగా తెచ్చుకున్నారు.. ఇలా ప్రతి విషయంపై ఆసక్తి కథనాలను పంచుకున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ సంచికలో పొందుపరచడం జరిగింది. ఇకపోతే అల్లు అర్జున్ ఈ కవర్ పేజి పై మెరిసిన సందర్భంగా సినిమా రంగంలో ఉన్న పరిస్థితిపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Advertisement

also read:దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

సినిమా కలెక్షన్స్ కంటెంట్ పైనే ఆధారపడతాయి – అల్లు అర్జున్

అల్లు అర్జున్ మాట్లాడుతూ..” నార్త్ అయినా.. సౌత్ అయినా.. మరే ప్రాంతీయ సినిమా అయినా సరే ప్రస్తుతం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఒకే ఒక్క కారణం యావరేజ్ కంటెంట్. ఇప్పుడు యావరేజ్ కంటెంట్ ఎక్కడా వర్కౌట్ కావడం లేదు. కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. కాబట్టి సినిమా ఏదైనా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ అందించడమే కీలకం.. కంటెంట్ ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే తాను నటించిన పుష్ప 1&2 చిత్రాల గురించి మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాలతో తాను పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను మరింత విస్తరించుకున్నాను. ఈ రెండు చిత్రాలు కలిపి సుమారుగా రూ.2,200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా కవర్ పేజీపై దర్శనం ఇవ్వడంతో అందరూ ఆయన టాలెంట్ కి ఫిదా అవుతూ ఆయనపై, ఆయన క్రేజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

అల్లు అర్జున్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ప్రముఖ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో రాకా (Raaka) అనే చిత్రంలో నటిస్తున్నారు.. హాలీవుడ్ ప్రమాణాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక అంతేకాదు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. రష్మిక మందన్న విలన్ షేడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో సుమారుగా మరో నలుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి అత్యధిక బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×