Realme P4s 5G: పెద్ద బ్యాటరీ, వేగవంతమైన డిస్‌ప్లే, గేమింగ్ పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే వారికి రియల్‌మీ P4s 5G ఆసక్తికరమైన ఎంపికగా నిలవనుంది. కంపెనీ భారత మార్కెట్లో ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 8000mAh భారీ బ్యాటరీతో పాటు 144Hz OLED డిస్‌ప్లే, 50MP OIS కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ విక్రయాలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి.
రియల్‌మీ P4s 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999గా ఉంది. 8GB RAM, 256GB వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12GB RAM, 256GB స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.41,999గా నిర్ణయించారు. టైటానియం గ్రే, ఎలక్ట్రిక్ సియాన్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో అర్హత ఉన్న బ్యాంక్ కార్డులతో రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.
Also Read: స్టూడెంట్స్, గేమర్స్ కోసం బెస్ట్ టాబ్లెట్స్.. లెనెవో, షియోమీ నుంచి శాంసంగ్ వరకు!
ఈ ఫోన్‌లో 8000mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ ప్రకారం సుమారు 28 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 6.77 అంగుళాల శాంసంగ్ M14 OLED డిస్‌ప్లే 1272 × 2772 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది.
రియల్‌మీ P4s 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు హైపర్ విజన్ ప్లస్ AI చిప్‌ను అందించారు. ఫోన్ వేడిని నియంత్రించేందుకు 7,000 చదరపు మిల్లీమీటర్ల VC కూలింగ్ సిస్టమ్ ఉంది. ఏఐ గేమింగ్ పార్ట్‌నర్ ఫీచర్ కూడా దీనిలో ఉంది. 50MP OIS కెమెరా, IP69 రేటింగ్ వెనుక భాగంలో f/1.8 అపర్చర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా ఉంది. దీనికి OIS సపోర్ట్ ఉండగా, 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ Realme P4s 5G ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0పై పనిచేస్తుంది. డ్యూయల్ 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద, భారీ బ్యాటరీ, 144Hz OLED డిస్‌ప్లే, గేమింగ్ హార్డ్‌వేర్, OIS కెమెరాతో రియల్‌మీ P4s 5G పవర్ యూజర్లు, గేమింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
Also Read: FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?