E-Paper
Advertisement

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Ranabali Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) తొలిసారి ‘గీతాగోవిందం’ సినిమా చేసి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు ఈ జంట. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దాదాపు 8 ఏళ్లపాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి.. ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. కానీ ఇప్పుడు దసరా రేసులో ఈ సినిమాను పోటీకి దింపబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రణబాలి కొత్త రిలీజ్ డేట్ లాక్..

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రణబాలి’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. 2026 అక్టోబర్ 10వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్లో మొదలుకానుంది”. అనే ఒక పవర్ఫుల్ క్యాప్షన్ తో రిలీజ్ చేసిన రణబాలి పోస్టర్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఆకట్టుకుంటున్న పోస్టర్..

Advertisement

ఇందులో వేట కొడవలి పట్టుకున్న విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే దసరా రేసులో ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది ఓకే కానీ అదే సమయంలో దాదాపు చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. మరి రణబాలి సినిమాకి దసరా బరిలో పోటీగా నిలవబోతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

also read: మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

వార్ తప్పదా?

Advertisement

ఇకపోతే దసరా పండుగ సందర్భంగా.. దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ దిగబోతున్న చిత్రాల విషయానికొస్తే.. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 చిత్రం అక్టోబర్ 15వ తేదీన విడుదలగా.. మరుసటి రోజు అనగా అక్టోబర్ 16వ తేదీన విజయ్ దేవరకొండ రణబాలితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓమ్ పార్ట్ 1 కూడా పోటీలో నిలవబోతోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా దసరా రేస్ లోనే ఉండడంతో పోటీ పెద్దగా ఉంటుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నా.. ఇప్పుడు దసరా రేసు నుంచి చిరంజీవి విశ్వంభర తప్పుకుంది. ఇక ఇప్పుడు రెండు తమిళ్ చిత్రాలతో రణబాలి సినిమా పోటీ పడడానికి సిద్ధమైంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Related News

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ ప్రయత్నం వృధా అయ్యిందా..? ఆ ఒక్కటే మిస్టేక్ నా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Big Stories

Advertisement
×