E-Paper
Advertisement

అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ
Advertisement

VW 43 inch Full HD Smart QLED TV: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి లివింగ్ రూమ్‌లో సినిమా థియేటర్ లాంటి ఫీల్,  కోరుకుంటున్నారు. అయితే.. ప్రీమియం క్వాలిటీ ఉన్న క్యూఎల్ఈడీ టీవీల ధరలు సాధారణంగా కాస్త ఎక్కువే ఉంటాయి. ఈ క్రమంలో.. తక్కువ బడ్జెట్‌లోనే క్వాంటమ్ డాట్ డిస్‌ప్లే టెక్నాలజీతో.. మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది . ఈ టీవీ మీ బడ్జెట్‌కు సరి పోతుందో లేదో, దీని ఫీచర్లు, ధరల వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.

పూర్తి రివ్యూ:

డిస్‌ప్లే, విజువల్ పెర్ఫార్మెన్స్ :

ఈ టీవీలో ప్రధాన ఆకర్షణ దీని 43-ఇంచుల డిస్‌ప్లే. సాధారణ ఎల్‌ఈజీ .. టీవీలతో పోలిస్తే.. క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల రంగులు చాలా ప్రకాశవంతంగా, సహజంగా కనిపిస్తాయి. ఇందులో .. ఉన్న బ్రైట్‌నెస్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్.. వల్ల గదిలో ఎటు పక్కన కూర్చున్నా విజువల్స్ స్పష్టంగా ఉంటాయి. బాజెల్-లెస్ ఫ్రేమ్‌ లెస్ డిజైన్ ఉండటం వల్ల టీవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మరింత పెద్దదిగా, స్టైలిష్‌గా అనిపిస్తుంది.

ఆడియో, సౌండ్ క్వాలిటీ :

Advertisement

స్మార్ట్ టీవీలలో పిక్చర్ క్వాలిటీ ఎంత ముఖ్యమో సౌండ్ కూడా అంతే.. ముఖ్యం. VW స్పెక్ట్రా సిరీస్ టీవీలో Stereo Box స్పీకర్లు ఉంటాయి. ఇవి 20W ఆడియో అవుట్‌ పుట్‌ను అందిస్తాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ లేదా సరౌండ్ సౌండ్.. ఎఫెక్ట్స్ వల్ల సినిమా డైలాగ్స్ స్పష్టంగా వినిపిస్తాయి. సాధారణ గదికి లేదా చిన్న లివింగ్ రూమ్‌కి ఈ ఆడియో సరి పోతుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫీచర్లు :

ఈ మోడల్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇన్-బిల్ట్ వై-ఫై, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్ ఫోటోలు, వీడియోలను టీవీ బిగ్ స్క్రీన్‌పై ఈజీగా ప్లే చేయవచ్చు.

Advertisement

Also Read: మార్కెట్‌లోకి ల్యాప్‌టాప్‌ను రీప్లేస్ చేసే ట్యాబ్.. ఫీచర్లు మామూలుగా లేవు

కనెక్టివిటీ, పోర్టులు :

కనెక్టివిటీ కోసం ఇందులో 2 HDMI పోర్టులు, 2 USB పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా పెన్‌డ్రైవ్‌లను ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. అలాగే హెడ్‌ఫోన్ జాక్ , ఎవి పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర, బెస్ట్ ఆఫర్లు:

ఇ-కామర్స్ మార్కెట్లో ఈ మోడల్ రూ. 13,999 నుంచి రూ. 15,999 రేంజ్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు.. లేదా పండగ సేల్స్‌లో.. దీని ధర ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ ధరలో క్యూఎల్ఈడీ డిస్‌ప్లేతో  43-ఇంచుల టీవీ రావడం నిజంగా గ్రేట్ వాల్యూ ఫర్ మనీ.

చాలా తక్కువ బడ్జెట్‌లో బ్రైట్ కలర్స్ ఇచ్చే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓఎస్ , లేటెస్ట్ బాజెల్-లెస్ లుక్ ఉన్న 43-ఇంచ్ టీవీ కావాలని అనుకుంటే.. ఈ మోడల్ ఒక మంచి ఆప్షన్. 4K రెజల్యూషన్ అవసరం లేదనుకుని, డైలీ ఎంటర్‌టైన్‌మెంట్.. కోసం ఒక బెస్ట్ బడ్జెట్ టీవీ వెతికే వారికి ఇది ఫర్ఫెక్ట్.

Related News

Poco F9 Ultraపై భారీ అంచనాలు.. కొత్త చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌తో ఎంట్రీ!

వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!

8000mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్.. Realme P4s 5Gలో ఇవే హైలైట్స్!

Airtel ఆల్‌ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!

మార్కెట్‌లోకి ల్యాప్‌టాప్‌ను రీప్లేస్ చేసే ట్యాబ్.. ఫీచర్లు మామూలుగా లేవు

స్టూడెంట్స్, గేమర్స్ కోసం బెస్ట్ టాబ్లెట్స్.. లెనెవో, షియోమీ నుంచి శాంసంగ్ వరకు!

స్పేస్‌లోకి 3,301 తేనెటీగలు.. 1984లో నాసా చేసిన ఈ ప్రయోగం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్ పక్కా!

Big Stories

Advertisement
×