E-Paper
Advertisement

ఓటీటీలోకి యశ్ టాక్సిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి యశ్ టాక్సిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Toxic OTT:’కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ హీరో యశ్ (Yash) కేజీఎఫ్ 2 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు.ఈ సినిమా తర్వాత యశ్ నుంచి వచ్చిన తాజా చిత్రం టాక్సిక్. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. విడుదల కావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ఎప్పుడైతే సినిమా అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను రెట్టింపు చేసింది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం. ప్రముఖ మలయాళ మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 26న కన్నడ , ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయగా.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ లో విడుదల చేశారు. ఇకపోతే ప్రీ సేల్ బుకింగ్ కారణంగా ఈ సినిమా మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్షన్ రాబట్టినా.. నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక మునుముందు కలెక్షన్లు వస్తాయా? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

టాక్సిక్ ఓటీటీ హక్కులు ఎవరి చేతికంటే?

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడడంతో ప్రముఖ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం పోటీపడ్డాయి. విడుదలకు ముందే నిర్మాతలు రూ.250 కోట్ల పైకి డిమాండ్ చేయడంతో ఆ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇక మరి ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్ఫామ్ దక్కించుకుంది? ఎంత ధరకు దక్కించుకుంది ? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా హక్కు జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. అన్ని భాషలను కలుపుకొని రూ.207 కోట్లకు డిజిటల్ , శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.

Advertisement

also read:అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇకపోతే తాజాగా ఒప్పందం ప్రకారం.. సినిమా థియేటర్లలో విడుదలైన 4 లేదా 8 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను నెలలోపే ఓటీటీలోకి తీసుకొస్తారా లేక రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికైతే టాక్సిక్ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకున్న జీ ఫైవ్ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.

టాక్సిక్ సినిమా స్టోరీ..

Advertisement

అనాధలుగా పెరిగిన అక్కాతమ్ముళ్లు గంగ (నయనతార), రాయ (యశ్). పరిస్థితుల ప్రభావంతో చిన్నప్పుడే ఆయుధం పట్టిన రాయ.. పెద్దయ్యాక ఘోర నేర సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఆ గ్యాంగ్ స్టర్ లైఫ్ లోకి నదియా (కియారా అద్వానీ) ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో రాయకు నదియా దూరమవుతుంది. అలా నదియా ఎందుకు దూరమైంది? వారి బిడ్డ టికెట్ (మరో పాత్రలో యశ్) తన తండ్రిని కలిశాడా? తండ్రీ కొడుకుల మధ్య సాగిన రౌద్ర పోరాటం ఏ తీరానికి చేరింది? అనేది తెరపై చూడాల్సిందే.

Related News

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×