Allu Arjun Remuneration:పుష్ప సిరీస్ తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నఈ సినిమా బడ్జెట్ దాదాపు 750 కోట్లని కోలీవుడ్ టాక్.దీంతో ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న బన్నీ ఎంత పారితోషికం తీసుకుంటాడా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.
అగ్రిమెంట్ చేసేముందే అమౌంట్
మామాలుగా మన దగ్గర స్టార్ హీరోలు సినిమా అగ్రిమెంట్ చేసేముందే ఒక అమౌంట్ ఇంతా అని ఫిక్స్ చేసుకుంటారు. ఉదాహరణకు రూ.50 కోట్లు, రూ.80 కోట్లు, రూ.100 కోట్లు.. ఇలా అమౌంట్ మాట్లాడుకుంటారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఆ అమౌంట్ ఆ హీరోకి వచ్చేస్తుంది.
కలెక్షన్స్ లో వాటా కావాలంటూ కండీషన్
కానీ బన్నీ మాత్రం నా రూటే సెపరేటు అంటున్నాడు. అవును..నాకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే సినిమా కలెక్షన్స్ లో వాటా కావాలంటూ కండీషన్ పెడుతున్నాడట.అంటే సినిమాకి ఎంత ఎక్కువ కలెక్షన్ వస్తే హీరోకు కూడా అంత ఎక్కువ డబ్బు వచ్చేలా డీల్ చేసుకోవడం అన్న మాట.ఈ లెక్కన సినిమాకి ఒక రూపాయి వస్తే అందులో 30 పైసలు బన్నీకి వస్తాయట .
1000 కోట్లు వస్తే రూ.300 కోట్లు బన్నీ ఖాతాలో
అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. సినిమా రూ.100 సంపాదిస్తే అందులో రూ.30 బన్నీ వాటా అన్నమాట. సినిమా రూ.500 కోట్లు సంపాదిస్తే లెక్క ప్రకారం రూ.150 కోట్లు. అదే సినిమా రూ.1000 కోట్ల వరకు వెళ్తే రూ.300 కోట్ల లెక్కన బన్నీ ఖాతాలో పడిపోతాయన్న మాట.సో రాకా సినిమా కి బన్నీ పుచ్చుకునే పారితోషికం అది వసూలు చేసే కలెక్షన్స్ బట్టి ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు అన్న మాట.
అయితే ఇలాంటి డీల్ బన్నీ ఎందుకు ఎంచుకున్నాడా అని డౌట్ రావొచ్చు.ఇక్కడ సినిమా పెద్ద హిట్ అయితే రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతుంది. ఒకవేళ ముందుగానే రూ.100 కోట్లు తీసుకుంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఆ రూ.100 కోట్లే. కానీ వాటా పద్ధతిలో సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ బన్నీకి వచ్చే అవకాశం ఉంటుంది.
నిర్మాతలకి ఇదే మంచి ఆప్షన్
అయితే ఇక్కడ నిర్మాతకు కూడా లాభమనే చెప్పాలి.ఎందుకంటే ముందుగానే హీరోకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.సినిమా బాగా ఆడితేనే హీరోకు ఎక్కువ ఇవ్వాలి. సినిమా అనుకున్నంతగా ఆడకపోతే అందుకు తగ్గట్టుగా ముట్టజెబితే సరిపోతుంది.ఒక రకంగా నిర్మాతలకి ఇదే మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఇదే బాటలో మిగతా హీరోలు కూడా నడిస్తే ఇండస్ట్రీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది.
ఇక రాకా సినిమా విషయానికి వస్తే సినిమా కి బడ్జెట్ తడిసి మోపెడు అవడం ,షూట్ చేసిన పుటేజ్ దాదాపు ఐదారు గంటల పైనే వస్తుండటంతో ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా మేకర్స్ వదల బోతున్నారని తెలుస్తుంది.ఇక పార్ట్-1ను వచ్చే ఏడాది డిసెంబరులో . 2028 సమ్మర్ లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ALSO READ :ఇరుముడి డైరెక్టర్‌తో ఈసారి జత కట్టేదెవరో?
చూడాలి మరి ఈ సినిమా కూడా బాహుబలి, పుష్ప సినిమాల లాగే బాక్సాఫీస్ వద్ద సంచలనం స్ప్రుష్టిస్తుంది అని ఆశ పడుతున్న మేకర్స్ ఎలాంటి ఫలితాన్ని రాబడటారో !