Bluetooth pairing issues: ప్రస్తుత యుగంలో బ్లూటూత్ ఇయర్ బడ్స్, స్పీకర్లు, హెడ్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే పాటలు వింటున్నప్పుడు లేదా కాల్ మాట్లాడేటప్పుడు బ్లూటూత్ సడన్‌గా డిస్‌కనెక్ట్ అయితే.. ఆ విసుగు వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇలా బ్లూటూత్ తరచూ కట్ అవ్వడానికి మన మొబైల్ లేదా గాడ్జెట్‌లో కొన్ని కారణాలు ఉంటాయి. దానికి గల ఐదు ప్రధాన కారణాలను , నిమిషాల్లో దాన్ని పరిష్కరించే ఈజీ మార్గాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్‌లో ఎక్కువ కాలం పాటు బ్లూటూత్ రన్ అవుతుండటం వల్ల దాని బ్యాక్‌గ్రౌండ్ క్యాష్ డేటా ఓవర్‌లోడ్ అవుతుంది.దీని వల్ల కనెక్షన్ స్టేబుల్‌గా ఉండదు.
పరిష్కారం: మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘Apps’ లేదా ‘App Management’ ఓపెన్ చేసి బ్లూటూత్ యాప్ డేటా, క్యాష్‌ను క్లియర్ చేయండి. ఆ తర్వాత ఫోన్‌ను ఒక్క సారి రీస్టార్ట్ చేయడం ద్వారా బ్లూటూత్ కనెక్షన్ సమస్య చాలా వరకు తొలగి పోతుంది.
సాధారణంగా బ్లూటూత్ డివైజ్‌లు ఒక నిర్దిష్ట పరిధిలో (సుమారు 10 మీటర్లు) మాత్రమే సరిగ్గా పని చేస్తాయి. మధ్యలో గోడలు, మెటల్ వస్తువులు లేదా ఇతర వైర్ లెస్ రౌటర్లు ఉంటే.. సిగ్నల్స్ అడ్డుపడతాయి.
పరిష్కారం: మీ స్మార్ట్‌ఫోన్ ,బ్లూటూత్ స్పీకర్ లేదా ఇయర్ ఫోన్‌లను వీలైనంత దగ్గరగా ఉంచండి. మధ్యలో ఎలాంటి పెద్ద అడ్డంకులు లేకుండా చూసు కోవడం ద్వారా డిస్‌కనెక్ట్ అయ్యే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఫోన్‌లో లేదా బ్లూటూత్ డివైజ్‌లో బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు, పవర్ సేవింగ్ మోడ్ ఆటోమేటిక్‌గా బ్యాక్ గ్రౌండ్ కనెక్షన్లను కట్ చేస్తుంది. ఇది కూడా డిస్‌కనెక్షన్‌కు ఒక ముఖ్య కారణం.
పరిష్కారం: మీ ఫోన్‌లో ‘Battery Saver’ లేదా ‘Power Saving Mode’ ఆన్‌లో ఉంటే డిజేబుల్ చేయండి. అలాగే బ్లూటూత్ ఇయర్ బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి వాడటం మంచిది.
మనం చాలా డివైజ్‌లను బ్లూటూత్‌కు కనెక్ట్ చేస్తుంటాం. కొన్ని సార్లు పాత పెయిరింగ్ డేటా కరప్ట్ అవ్వడం వల్ల కొత్త లేదా ప్రస్తుత డివైజ్‌తో కనెక్షన్ సరిగ్గా సింక్ కాదు.
పరిష్కారం: మీ ఫోన్ బ్లూటూత్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సమస్య ఇస్తున్న డివైజ్‌ని ‘Unpair’ లేదా ‘Forget This Device’ చేయండి. ఆ తర్వాత మళ్లీ కొత్తగా పెయిర్ చేయండి. ఈ సింపుల్ ట్రిక్ చాలా సార్లు అద్భుతంగా పని చేస్తుంది.
Also Read: రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్
ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా బ్లూటూత్ గాడ్జెట్ యొక్క ఫర్మ్‌వేర్ పాతదైతే, బగ్స్ కారణంగా బ్లూటూత్ కనెక్షన్ తరచుగా ఆగి పోతుంటుంది.
పరిష్కారం: మీ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్ చేయండి. అలాగే.. మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లేదా స్పీకర్‌కు సంబంధించిన కంపెనీ అఫీషియల్ యాప్ ద్వారా దాని ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
బ్లూటూత్ డిస్‌కనెక్ట్.. అయ్యే సమస్య చిన్నదే అయినప్పటికీ,.. అది మన పనికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పైన పేర్కొన్న చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీ బ్లూటూత్ కనెక్షన్‌ను ఎప్పుడూ స్టెబిలిటీగా ఉంచుకోవచ్చు. ఈ ట్రిప్స్ ఫాలో అయి మీ వైర్‌లెస్ ఫీల్ మరింత ఆనందదాయకం చేసుకోండి!