Noise Buds N2 Pro: ప్రస్తుత డిజిటల్ యుగంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయాయి. ఆఫీస్‌లో .. ఉన్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వర్కౌట్ చేసేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ,నాయిస్ క్యాన్సిలేషన్ ఉండే ఇయర్ బడ్స్ ఉంటే ఆ మజాయే వేరు. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారి కోసం నాయిస్ సంస్థ ‘బడ్జెట్ కింగ్’ లాంటి ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘Noise Buds N2 Pro’ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తాయి.’స్లేట్ బ్లాక్’కలర్, ఆకర్షణీయమైన మెటాలిక్ ఫినిషింగ్ దీనికి ఒక రిచ్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. చెవుల్లో.. పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉండటంతో పాటు.. ఎక్కువ సేపు వాడినప్పటికీ ఎలాంటి నొప్పి ఉండదు. పాకెట్ ఫ్రెండ్లీ కేసు కారణంగా.. దీన్ని ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
బయటి ప్రపంచంలోని అనవసరమైన శబ్దాలను పూర్తిగా.. అణచివేయడానికి ఇందులో.. 32dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ లభిస్తుంది. రద్దీగా ఉండే బస్సులు, ట్రెయిన్లు లేదా రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు బయటి సౌండ్స్ అస్సలు వినిపించవు.దీని వల్ల పాటలు వినేటప్పుడు లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.
బ్యాటరీ బ్యాకప్ విషయంలో ..ఈ ఇయర్ బడ్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేసుతో.. కలిపి మొత్తం 70 గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. అంటే ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి బ్యాటరీ టెన్షన్ ఉండదు. అంతేకాదు.. ఇందులో ఉన్న ‘ఇన్‌స్టాచార్జ్’ టెక్నాలజీ కారణంగా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు..ఏకంగా 200 నిమిషాల పాటు నాన్ స్టాప్ ప్లేటైమ్ లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఇది చాలా అప్‌డేటెడ్‌గా వస్తుంది. ఇందులో.. లేటెస్ట్ బ్లూటూత్ v6.0 టెక్నాలజీని అందించారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌కు ఇయర్ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. సిగ్నల్ డ్రాప్ సమస్యలు అసలు ఉండవు. అలాగే ఒకే సమయంలో రెండు డివైజెస్‌కు కనెక్ట్ చేసుకునే ‘డ్యుయల్ పేరింగ్’ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
Also Read: రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్
గేమ్స్ ఆడే వారి కోసం తక్కువ లేటెన్సీ మోడ్ ఇందులో పని చేస్తుంది. దీని వల్ల ఆడియో, వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు. అలాగే ఈఎన్సీ మైక్రో ఫోన్లు ఉండటం వల్ల కాల్స్‌లో మీ గొంతు అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది.కేవలం రూ.1,799 ధరకే లభించడం టెక్ మార్కెట్‌లో దీనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్, ANC కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ట్రెండీ గాడ్జెట్‌ను మీసొంతం చేసుకొని మీ మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి!