E-Paper
Advertisement

బంధువులకు సెండాఫ్ ఇచ్చేందుకు వందేభారత్ ఎక్కారు.. షాకింగ్.. రూ.30 వేల జరిమానా కట్టారు!

బంధువులకు సెండాఫ్ ఇచ్చేందుకు వందేభారత్ ఎక్కారు.. షాకింగ్.. రూ.30 వేల జరిమానా కట్టారు!
Advertisement

Vande Bharat Fine: రైల్వే స్టేషన్ కు వెళ్లి బంధువులకు వీడ్కోలు చెప్పడం కామన్. అలాగని, రైల్లోకి ఎక్కి మరీ సెండాఫ్ ఇస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన 12 మంది, రైలు ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. చివరకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడమే కాకుండా, రూ.30 వేలకు పైగా జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. నవంబర్ 15న జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు రైలు ఎక్కి..

నవంబర్ 15న వారణాసి నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు తమ బంధువులకు వీడ్కోలు చెప్పడానికి స్టేషన్‌కు వచ్చారు. వారితో పాటు ఉన్న సామానును రైలులోకి ఎక్కించేందుకు 12 మంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించారు. అయితే, రైలు బయలుదేరే సమయానికి వారంతా కిందకు దిగలేకపోయారు. ఇంతలో వందే భారత్ రైలు ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోయాయి. దీంతో వారంతా రైలు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. తలుపులు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో వెంటనే బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

150 కిలోమీటర్ల ప్రయాణం..  

Advertisement

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ కాన్పూర్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్‌కు చేరుకుంది. ఈలోగా రైలులో టికెట్లు లేకుండా కొంతమంది ప్రయాణిస్తున్నారనే సమాచారం రైల్వే అధికారులకు అందింది.  రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటావా స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది రైలును తనిఖీ చేశారు. చీఫ్ టికెట్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో విచారణ చేపట్టారు.

ఒక్కొక్కరికి రూ.3,000 జరిమానా

తనిఖీల్లో 12 మంది పెద్దలు, ఒక చిన్నారి సరైన ప్రయాణ టికెట్లు లేకుండా రైలులో ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రయాణ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు కూడా లేవని అధికారులు నిర్ధారించారు. రైల్వే నిబంధనల ప్రకారం అనధికార ప్రయాణికులుగా పరిగణించి, ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున జరిమానా విధించారు. దీంతో మొత్తం జరిమానా రూ.30 వేలకు పైగా చేరింది.

ప్లాట్‌ఫాం టికెట్ తప్పనిసరి!

Advertisement

ఈ ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. రైల్వే స్టేషన్‌లోకి వచ్చి బంధువులకు వీడ్కోలు చెప్పాలన్నా, వారి సామానును రైలులోకి ఎక్కించడంలో సహాయం చేయాలన్నా తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వందే భారత్ వంటి రైళ్లలో భద్రత కోసం ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. రైలు బయలుదేరిన తర్వాత తలుపులు మూసుకుపోతాయి. సో, ప్రయాణ టికెట్ లేకుండా రైలు ఎక్కడం, కాసేపు లోపల ఉండి దిగిపోవచ్చని భావించడం కూడా ఇబ్బందులకు కారణం అవుతుంది. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ జరిమానాకు కారణమవుతుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Read Also: రైల్లో సైడ్ లోయర్ బెర్త్‌ నే ఎందుకు కోరుకుంటారు? సైకాలజీ చెప్పే క్రేజీ విషయాలివే!

Tags

Related News

రైల్లో సైడ్ లోయర్ బెర్త్‌ నే ఎందుకు కోరుకుంటారు? సైకాలజీ చెప్పే క్రేజీ విషయాలివే!

అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

కాకులు వాలని ఎకైక పుణ్య క్షేత్రం.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న యాగంటి రహస్యాలివే?

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

వీసా లేకుండానే ఐర్లాండ్ ట్రిప్.. భారతీయులకు బంపర్ ఆఫర్!

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

Big Stories

Advertisement
×