Allu Arjun : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి అల్లు కనక రత్నం గారు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్వయంగా చిరంజీవికి అత్తగారు కావడంతో ఆమె మరణవార్త విన్న వెంటనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. చివరి తంతువరకు దగ్గరుండి చూసుకున్నాడు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ చేసిన ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.
అత్తగారి ఆత్మకు చేకూరాలని కోరుతూ పవన్ ట్వీట్..
పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు. ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఏం కూడా.. అయితే కొన్ని రోజుల ముందు నుంచే వైజాగ్లో జనసేన సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అందుకే అల్లు అరవింద్ గారి ఇంట్లో పొద్దున్న కనిపించలేదు. అక్కడ సభ పూర్తయిన వెంటనే హైదరాబాద్ చేరుకొని డైరెక్ట్ గా అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అత్తగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
అందులో శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.. దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. శ్రీమతి కనకరత్నమ్మ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. అని ట్వీట్ చేశారు. తాజాగా ఆ ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందించారు.
Also Read :టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని అంటే ప్రాణమిచ్చే స్టార్ హీరో ఎవరో తెలుసా..?
మామ ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై..
నానమ్మ చనిపోయిన బాధలో ఉన్న అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు, అభిమానులు దైర్యం చెబుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కు బన్నీ రిప్లై ఇచ్చాడు. కళ్యాణ్ గారూ, మీ హృదయపూర్వక ప్రార్థనలకు ధన్యవాదాలు. చెన్నై నాటి రోజులు గుర్తుకువస్తున్నాయి. ఇప్పటికీ మీ హృదయంలో ప్రతిధ్వనిస్తోందని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక నమస్కారాలు అని ట్వీట్ చేశాడు బన్నీ.. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న అపార్థంతో మొదలైన గొడవలు సర్దుమణిగాయని మెగా, అల్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది.
Thank you for your heartfelt prayers, Kalyan garu. It is heartwarming to know that the affection from the Chennai days still echoes in your heart. Warmest regards 🙏🏽
— Allu Arjun (@alluarjun) August 30, 2025