BigTV English

Viral Video: మందేసిన పీత.. దాని షకలు చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే!

Viral Video: మందేసిన పీత.. దాని షకలు చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే!

Drunken Crab Viral Video: మందు బాబులు చేసే పనులు, వేసే వేషాలు ఎంత కామెడీ పంచుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కడుపులో ఇంత మందు పడ్డాక, ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఎప్పటికప్పుడు మందుబాబులకు సంబంధించిన యూనిక్ వీడియోలో సోషల్ మీడియాలో నెటిజన్లకు బోలెడు వినోదాన్ని పంచుతాయి. తాజాగా ఫుల్ గా మందేసిన ఓ వ్యక్తి, బీచ్ లో పీతకు మందు తాగిస్తూ కనిపించాడు. పీత కడుపులో కాస్త తీర్థం పడగానే, అది చేసే విన్యాసాలు చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే.


నెట్టింట వైరల్ అవుతున్న పీత వీడియో

ఇక ఈ వీడియోలో ఓ వ్యక్తి బీచ్ లో కూర్చున్నాడు. అప్పటికే ఫుల్ గా తాగేసి ఉన్నాడు. తాగిన తర్వాత బీచ్ లో ఎంజాయ్ చేస్తే బాగుండేది. కానీ, కడుపులో ఉన్నది మెల్లగా ఎలా ఉంచుతుంది? ఇక బీచ్ లో నడుస్తున్న ఓ పీత కనిపించింది. దాన్ని పట్టుకున్నాడు. నెమ్మదిగా దాని నోరు తెరిపించి.. తన దగ్గర ఉన్న మద్యాన్ని దానికి తాపించాడు. కాసేపటి తర్వాత దానిని వదిలిపెట్టాడు. ఆ తర్వాతే మొదలయ్యింది అసలు కద. తాగక తాగక మద్యం తాగిన పీత సోయి తప్పింది. ముందుకు నడవ లేక చీటికి మాటికి తూలిపడుతూ కనిపించింది. ఈ ఫన్నీ వీడియోను తన ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ పని మంతుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Read Also: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “మనమే అనుకున్నా.. మందేస్తే ఏదైనా ఉగాల్సిందే. అయినా, పీతకు కాదు బ్రో తాగించాల్సింది సింహానికి” అని నెటిజన్ కామెంట్ చేశాడు.  “ఎందుకురా నీ అలవాట్లు కూడా దానికి నేర్పిస్తావు?” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “జీవ హింస మహా పాపము. అందరూ అనుభవిస్తారు. ఎవరు అయితే జీవిని హింస చేసి రాక్షస ఆనందం పొందుతారో వాళ్ళందరికీ గరుడ పురాణంలో ఉండే అన్ని శిక్షలు వేయబడతాయి” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. “బ్రో వెళ్లి దాన్ని ఆపండి. లేదంటే వెళ్లి షార్క్ తో గొడవ పడుతుంది” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “పీతల తాగటం అంటే ఏమిటో అనుకున్నా! ఇప్పుడు లైవ్‌లో చూశా!” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఫన్నీగా ఆకట్టుకుంటుంది.

Read Also: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!

Related News

Viral Video: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!

ATOR N1200: వరద ప్రాంతాల్లో అటోర్ వాహనాల మోహరింపు, ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే?

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Big Stories

×