Actor Ranjith: రాజకీయాల్లోకి వచ్చాకా విమర్శలు తప్పవు. అది స్టార్ హీరోస్.. రాజకీయాల్లోకి అడుగుపెడితే అటు సినీ నటులు.. ఇటు ప్రత్యర్థులు.. రెండు వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటుండగా.. తమిళనాడులో దళపతి విజయ్ ఇప్పుడిప్పుడే ఇలాంటివి అలవాటు చేసుకుంటున్నాడు. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ ప్రకటించడమే కాకుండా తమిళిగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించాడు.
ఇక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. మహానాడులు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే నిన్న జరిగిన మహానాడులో విజయ్.. ప్రధాని మోడీపై విమర్శలు చేశాడు. ప్రధానిని మిస్టర్ అంటూ సంభోదించడమే కాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక తమ ప్రధానిని.. విజయ్ అవమానించాడని బీజేపీ నేతలు, కార్యకర్తలు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇక బీజేపీ పార్టీలో ఉన్న నటుడు, దర్శకుడు రంజిత్.. విజయ్ పై మండిపడ్డాడు. ప్రధానిని పట్టుకొని అన్ని మాటలు అంటాడా అంటూ ఆయనపై విరుచుకుపడ్డాడు. ” దేశప్రధానిపై చిటికెలు వేసి మాట్లాడతాడా.. ? ఆయనపై విమర్శలు చేస్తాడా.. ? ఆయన నాకు ఎదురైతే ముఖం పగలకొడతాను. ఆయన చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక రంజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో మంచి మంచి సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి సినిమాలను తెరెకెక్కించాడు. తెలుగులో చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాలో విలన్ గా నటించాడు రంజిత్. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ మధ్యనే రంజిత్.. తమిళ్ బిగ్ బాస్ లో కూడా సందడి చేశాడు. అయితే కొన్నిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక విజయ్ ను ముఖం పగులకొడతాను అని అనడంతో ఆయన ఫ్యాన్స్.. రంజిత్ పై మండిపడుతున్నారు. మరి ఇది ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.