Allu Arjun vs Pawan Kalyan : అల్లు అర్జున్ నుంచి సినిమా రిలీజ్ అయినా… ఇటు మెగా హీరోల నుంచి సినిమాలు రిలీజ్ అయినా… ప్రతి సారి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ టైంలో కూడా ఈ ఫ్యాన్ వార్ జరుగుతుంది. అయితే ఈ సారి అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్లిపోయింది. పర్సనల్ అటాక్స్‌తో ఈ ఫ్యాన్ వార్స్ ముదిరిపోయాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పార్టీకి, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కూటమికి సపొర్ట్ చేయకుండా… ఆయన ప్రత్యర్థి పార్టీకి అల్లు అర్జున్ సపొర్ట్ చేశాడు. అప్పటి నుంచి ఈ వార్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పుష్ప 2 సినిమా టైంలో అయితే అవి పీక్స్ కి వెళ్లాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన టైం కూడా అదే పరిస్థితి.
ఇక మెగా కంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా టైంలో అల్లు అర్జున్ అభిమానులు నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హరి హర వీరమల్లు టైంలో కూడా వాళ్లు అదే చేస్తున్నారు. అయితే దీనిపై మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 మూవీ రికార్డులను హరి హర వీరమల్లు క్రాస్ చేస్తుంది అంటూ మెగా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.
అలా సాగుతున్న ఫ్యాన్స్ వార్ అదుపుతప్పాయి. ఈ సినిమా హీరో, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య కొణిదెల అన్నా లెజ్‌నోవా పై కొంత మంది అభ్యంతరకరమైన ట్వీట్స్ వేశారు. అవి కాస్త వైరల్ అవ్వడంతో… పవన్ కళ్యాణ్ అభిమానులు సీరియల్ అయ్యారు. అలాగే ఆ అకౌంట్స్‌పై ఫిర్యాదు చేశారు.
ఎవరైతే, అభ్యంతరకరమైన ట్వీట్స్ వేశారో… వారి సోషల్ మీడియా అకౌంట్స్ దాదాపు అన్నీ కూడా సస్పెండ్ అయ్యాయి. అయినా… ఫ్యాన్స్ వార్ ఆగిపోలేదు. పవన్ కళ్యాణ్ అధికార బలాన్ని తమపై చూస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉండి ప్రజాసేవ చేయకుండా.. తమపై ప్రతికారం తీర్చుకుంటున్నాడని, ఆయన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకుంటున్నాడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఇలా రెండు వర్గాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ సోషల్ వార్స్ హరి హర వీరమల్లు రిలీజ్ వరకు ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది.