Hero Raja: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. అందులో ఒకటే ఆనంద్.. కమల్ని ముఖర్జీ(Kamalini Mukherjee), రాజా(Raja) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆనంద్ మూవీ.. హీరో రాజా కెరీర్ మలుపు తిప్పిన సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత రాజా నటించిన సినిమాలేవి హిట్ అవ్వలేదు. అయితే అలాంటి రాజా రూ.2 కోట్ల ఆఫర్ ని మిస్ చేసుకున్నారట. మరి ఇంతకీ ఆనంద్ మూవీ హీరో రాజా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు రూ.2 కోట్ల ఆఫర్ ని మిస్ చేసుకున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సూసైడ్ చేసుకోవాలనుకున్న హీరో రాజా..
తల్లి, తండ్రి లేని అనాధలా చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగారు నటుడు రాజా. చిన్న వయసులోనే తల్లి, ఆ తర్వాత తండ్రి ఇద్దరు మరణించడంతో దిక్కులేని స్థితిలో రాజా సూసైడ్ చేసుకొని మరణించాలనుకున్నారు. కానీ ఆయనకి ఇంకా భూమ్మీద నూకలు తినే ఛాన్స్ ఉంది. అందుకే ఫ్రెండ్స్ కాపాడడంతో బతికి బయటపడ్డారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇతరుల సహాయంతో చిన్న చిన్న పనులు చేస్తూ పెద్ద చదువులు చదువుకొని అమెరికాలో జాబ్ చేశారు.ఇక అమెరికాలో జాబ్ చేసి బాగా సెట్ అయిన సమయంలోనే థియేటర్ యాక్టింగ్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేశారు.
మోడలింగ్ చేస్తూనే సినిమాలలో అవకాశం..
అయితే మొదట నార్త్ ఇండస్ట్రీలో సినిమాలు ట్రై చేయగా.. ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో ముంబై (Mumbai) కి వెళ్ళిపోయి మోడలింగ్లో రాణిస్తూ నాటకాలు వంటివి చేశారు. ఆ తర్వాత ఓ చిన్నదాన(O Chinnadana) సినిమాలో సెకండ్ హీరోగా నటించి, ‘ఆనంద్’ మూవీలో అవకాశం అందుకున్నారు. ఈ సినిమా రాజా కెరీర్ ని మలుపు తిప్పింది.అలా ఆనంద్ మూవీ హిట్ తో మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు(Mogudu Pellam O Dongodu), కోకిల, ఆ నలుగురు(A Naluguru),మిస్టర్ పెళ్ళాం, అప్పుడప్పుడు వంటి సినిమాల్లో నటించారు.
ఇండస్ట్రీకి దూరమైన హీరో రాజా..
ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో రాజా చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సడన్గా పాస్టర్ అవతారం ఎత్తి ఎన్నో చర్చిల్లో ఉపన్యాసాలు ఇస్తూ పబ్బం గడిపారు. ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ లో చేరినట్టు కూడా కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
పాస్టర్ గా మారిన రాజా.. రూ.2కోట్ల మూవీ ఆఫర్ మిస్..
ఇదిలా ఉంటే తాజాగా రాజాకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పాస్టర్ అవతారంలో ఉన్న రాజా నాకు రూ.2 కోట్ల ఆఫర్ వచ్చింది. రీసెంట్ గానే వాళ్లు కాల్ చేశారు. కానీ నేను ఆ సినిమా చేయనని రిజెక్ట్ చేశాను. నేను సేవలోకి వచ్చాక ఎంతో మంది డబ్బు ఆశ చూపి సినిమాల్లోకి రమ్మన్నారు. 2కోట్లు ఇస్తామన్నారు. కానీ మీ డబ్బు ఎవరికి కావాలయ్యా అని నేను వదిలేసాను అంటూ రాజా చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం రాజా మాట్లాడిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు సినిమాలు చేసుకుంటూ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగకుండా పాస్టర్ గా ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే రాజా తల్లి క్రిస్టియన్ కావడంతో ఆయన పాస్టర్ గా మారినట్లు తెలుస్తోంది.
ALSO READ:Tamannaah – Vijay Varma: అమీర్ ఖాన్ లవర్ ను సెట్ చేసుకున్న తమన్నా మాజీ లవర్!