Satya Sri: సత్య శ్రీ (Satya Sri).. ఒకప్పుడు పలు సినిమాలతో కెరియర్ మొదలుపెట్టినా.. జబర్దస్త్ (Jabardast) ద్వారానే భారీ పాపులారిటీ అందుకుంది ఈ చిన్నది. చమ్మక్ చంద్ర (Chammak Chandra)భార్య క్యారెక్టర్ లో నటించి, ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు సినిమాలలో కీలక పాత్రలలో మెరుస్తున్న ఈమె.. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో తెలియని విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తన చెల్లే.. అంటూ హాట్ బాంబ్ పేల్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె వల్లే పెళ్లికి దూరం – సత్య శ్రీ
సత్య శ్రీ మాట్లాడుతూ..”మా ఇంట్లో కొడుకుని అయితే ఎలా అయితే బాధ్యత తీసుకుంటానో.. ఇప్పుడు కూడా నేను అలాగే బాధ్యతలు తీసుకున్నాను నేను జబర్దస్త్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని నా చెల్లి కోసమే ఖర్చు చేశాను. ప్రస్తుతం ఆమె ఎల్ అండ్ టీ లో జాబ్ సంపాదించి, పూణేలో పనిచేస్తోంది. ఇక నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రస్తుతం పెళ్లి చేసుకొనే ఆసక్తి నాకు లేదు. మొదట నా చెల్లి పెళ్లి చేసి, ఆ తర్వాతే నేను చేసుకుంటాను. నాకంటే కూడా నా చెల్లికే పెళ్లి చేసుకోవాలనే ఆశ ఎక్కువగా ఉంది. నేను నా చెల్లి టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళము. నేను ఏది కొనుగోలు చేసినా.. అది తను కచ్చితంగా తీసుకుంటుంది. ఆఖరికి భర్త విషయంలో అయినా సరే.. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తనే తను కావాలి అంటే అప్పుడు నేనేమవ్వాలి. అందుకే మొదట తనకు పెళ్లి చేసి, ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను” అంటూ సత్య శ్రీ పలు షాకింగ్ కామెంట్లు చేసింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి ప్రపోజల్స్ పై సత్య శ్రీ కామెంట్స్..
పెళ్లి ప్రపోజల్స్ కూడా ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా మా అమ్మమ్మ ఏకంగా షూటింగ్ సెట్ కి కూడా పెళ్లిచూపులు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చి షూటింగ్స్ లో పాల్గొని వద్దని చెప్పడంతో వెంటనే నేను సీరియస్ అయ్యాను. ఇలా నాకు షరతులు విధించే వాళ్లంటే నచ్చదు అంటూ తెలిపింది.
షరతులపై సత్య శ్రీ ఏమన్నారు అంటే..
చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారు కూడా మనల్ని అది చేయాలి.. ఇది చేయాలి.. అలా చేయకూడదు.. ఇలా ఉండకూడదు.. అని ఏ రోజు కూడా షరతులు పెట్టరు. అలాంటిది ఎవరో ఒకరు జీవితంలోకి వచ్చాక అలానే ఉండాలి. మేము చెప్పిందే చేయాలి అనే షరతులు పెడితే అసలు ఎలా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లగలం. అందుకే షరతులు పెట్టే వాళ్ళు అంటే నాకు అసలు నచ్చదు అంటూ తెలిపింది.
అమ్మ కల నెరవేర్చడమే ధ్యేయం..
సత్య శ్రీ మాట్లాడుతూ.. ” మా అమ్మ ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంది. కానీ కాలేకపోయింది. ఇప్పుడు అమ్మ కలను నెరవేర్చాలని నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇక కెరియర్ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ సత్య శ్రీ తెలిపింది.
also read:Deepika padukone: పబ్లిక్ లో దీపికా పరువు తీసిన డైరెక్టర్.. మరీ ఇంత దిగజారుడు తనమా!