E-Paper
Advertisement

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !
Advertisement

Anasuya Bharadwaj:అనసూయ భరద్వాజ్ …తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.ఇక ఈ మధ్య సినిమాలు, షో ల కన్నా ఇన్ స్టా లో పెట్టే పోస్ట్ లతోనే ఎక్కువ వైరల్ అవుతుంది.ఇక ఇదే క్రమంలో తాజాగా అనసూయ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అవమానించిందంటూ తన పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది.

తాను ఎక్కడా సనాతన ధర్మాన్ని కాని, హిందూ ధర్మాన్నికాని ఎక్కడా అవమానించలేదని తను మాట్లాడిన పూర్తి వీడియోలని కాకుండా కేవలం అందులోని కొన్ని సెకన్లని మాత్రమే కట్ చేసి తనపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని మండి పడింది.

నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు 

Advertisement

నా మాటలని కొందరు మిస్ అండర్ స్టాండ్ చేసుకుని మిగాతావారందరిని తప్పు దోవ పట్టిస్తున్నారని, అందుకే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. నేను మాట్లాడింది నన్ను కాని లేక ఇంకెవరినైనా కాని తిట్టడం లేదా వల్గర్ కామెంట్స్ చేస్తూ,వ్యక్తిగతంగా ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకి దిగే వాళ్ళ పైనే మాట్లాడను తప్ప ఏ మతాన్ని కాని, ధర్మాన్ని కాని తానూ కించ పరచాలన్న ఉద్దేశంతో టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కావని తెలిపింది.ఇక తాను సనాతనిగా, హిందూగా ఉండటం గర్వంగా భావిస్తానని, ఈ విషయం మాత్రం అందరికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాని పేర్కొంది.

సనాతన ధర్మ తనకి ధైర్యంగా ఉండటం, సత్యం కోసం నిలబడటం, ఎదుటివారిని కూడా మనిషి గౌరవించడం వంటివి నేర్పించింది అని చెప్పుకొచ్చింది.ముఖ్యంగా నా ధర్మం ,నా నమ్మకం, నా విలువల గురించి నాకు భాగా తెలుసని,ఈ విషయంలో ఎవరికీ సారీ చెప్పాల్సిన పని లేదని కుండ బద్దలు కొట్టింది.

నేను హనుమంతుడి కుమార్తెని 

Advertisement

ఇక అన్నింటికన్నా ముఖ్యంగా నేను హనుమాన్ కుమార్తెగా భావిస్తాను అని చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.హనుమాన్ అంటేనే భక్తీ, ధైర్యం అని,బలం, బయపడకపోవడం అని,ఆయనే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అని తెలిపింది.అందువల్లే ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుకుండ ఉండటం తన నేచర్ లోనే లేదని తేల్చి చెప్పింది.

ఇక కొందరు నేను మాట్లాడిన మాటలని పూర్తిగా ఎడిట్ చేసి కేవలం అనసూయ హిందూయిజం,సనాతన ధర్మం మీద మాట్లాడింది అని తప్పుగా చిత్రీకరించడం చాలా తప్పు అంటూ వాపోయింది.ఇక నేను ఎవరి మతం ఆధారంగా జడ్జ్ చేయలేదని,కేవలం వల్గర్ కామెంట్స్ చేసే వాళ్ళని మాత్రమే ప్రశ్నించానని చెప్పుకొచ్చింది.కాబట్టి ఎవరైనా సరే సగం సగం క్లిప్స్ ఎడిట్ చేసిన వాటిని చూసి ఒక అంచనాకి రాకుండా ,అసలు ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చెప్పానో అన్నది పూర్తిగా తెలుసుకుని ఒక అభిప్రాయానికి రావాలని తెలిపింది.ఇక తను ఒక సనాతని అని చెప్పుకోవడంలో తనకు ఎలాంటి హెసిటేషన్ లేదని, హిందువుని అని చెప్పుకోవడంలో తనకు ఒక గర్వం ఉందని వివరంగా రాసుకొచ్చింది.

అనసూయ పై విమర్శల దాడి ఆగుతుందా లేదా?

కులాలు, మతాలు ఏవైనా, చెడు చెడే అని, గౌరవించకపోవడం గౌరవించకపోవడమే అని తేల్చి చెప్పింది.చివరగా జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ రాసుకొచ్చింది, అనసూయ.చూడాలి మరి నేను సనాతనిని హిందువులని ఎక్కడా అవమానించలేదు అని ఇంతగా క్లారిటీ ఇచ్చిన అనసూయ పై విమర్శల దాడి ఆగుతుందా లేదా ముందు ముందు చూడాలి !

Tags

Related News

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

Advertisement
×