Sai Pallavi Remuneration:సాయి పల్లవి..ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్స్ లిస్టు తీస్తే ఈ ముద్దుగుమ్మ టాప్ టెన్ చోటు దక్కించుకుంటుంది అనడంలో సందేహం లేదు .చేతిలో అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి.
ఇక ప్రస్తుతం సీతమ్మగా చేస్తున్న రామాయణ రెండు పార్ట్స్ కోసం ఏకంగా 20 కోట్లు పుచ్చుకుంటుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది.మరి ఇప్పుడు కోట్లలో పారితోషికం తీసుకుంటున్న సాయి పల్లవి మొదటగా అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందామా !
ఫస్ట్ మూవీకి ఎంత తీసుకుంది?
తమిళనాడులోని కోటగిరిలో జన్మించిన సాయి పల్లవి మొదటి సినిమా కస్తూరి మాన్.2005 లో వచ్చిన ఈ సినిమాలో కాలేజీ అమ్మాయి గా కనిపించిన సాయి పల్లవి తన మొదటి పారితోషికంగా నాలుగు వేల పారితోషికాన్ని తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2008 లో వచ్చిన ధామ్ ధూమ్ సినిమా కోసం దాదాపు పదివేల పై చిలుకు పారితోషికాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.
అయితే సాయి పల్లవికి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం. ‘ప్రేమమ్’. అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ సినిమా మలయాళం లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఇందులో ‘మలర్’ అనే పాత్రలో సాయి పల్లవి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాతోనే సాయి పల్లవి పేరు ఒక్కసారిగా సౌత్ ఇండియా మొత్తం మార్మోగిపోయింది.
ఇక ఈ సినిమా కోసం సాయి పల్లవి అందుకున్న రెమ్యూనరేషన్ దాదాపుగా ఐదు నుండి పది లక్షల మధ్యలో ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఇదే విషయంపై సాయి పల్లవి అఫీషియల్ ఏమైనా చెబితే కాని అసలు విషయం తెలిసేలా లేదు.
ఒక్క సినిమాతో మారిపోయిన సీన్
అయితే ‘ప్రేమమ్’ సక్సెస్ తర్వాత సాయి పల్లవి దశ తిరిగిందనే చెప్పాలి . వరుస అవకాశాలు క్యూ కట్టినప్పటికీ ఎక్కడా తగ్గకుండా తన చదువును పూర్తి చేయడం విశేషం. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ .ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఎంసీఏ’శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో ఆమె మార్కెట్ మరింత పెరిగిందనే చెప్పాలి.
అప్పట్లో లక్షలు.. ఇప్పుడు కోట్లలో!
అలా ఇమేజ్ పెరగడంతో సాయి పల్లవి కెరీర్ ప్రారంభమైన కొద్ది సంవత్సరాల్లోనే ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. 2018 నాటికే ఒక తెలుగు సినిమాకు ఆమె సుమారు రూ.1.4–1.5 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినబడింది.
also read :ప్యారడైజ్ ప్యాకప్ అయినట్టేనా?
ఇక ప్రస్తుతం చూస్తే సాయి పల్లవి ఒక్కో సినిమాకు సుమారు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ‘రామాయణ’ రెండు భాగాల కోసం ఆమెకు రూ.18–20 కోట్ల వరకు పారితోషికం ముడుతుందని సమాచారం. అయితే ఇవన్నీ మీడియాలో వినిపించే వార్తలే తప్ప సాయిపల్లవి అఫీషియల్ గా చెప్పిన విషయాలు కాదని గుర్తుంచుకోవాలి.