Pan Masala Ads:ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సెలెబ్రిటీలు ఇష్టానుసారం కూల్ డ్రింక్స్ ,పొగాకు ,అలాగే ఆల్కహాల్ వంటివాటిని ఎన్నింటినో ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్స్ గా వెలిగిపోతుండటం మనం చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా పాన్ మసాలా, పొగాకు వంటి ఉత్పతులని మేమూ వాడుతున్నాం ,మీరూ వాడండి అంటూ బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ లు తెగ ప్రమోట్ చేయడం మనకి తెల్సిందే.ఇదిగో సరిగ్గా ఈ అంశంపైనే ఫైర్ అయ్యారు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముంఢే.
యువ ఎన్‌క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న తుకారాం ముంఢే
విషయంలోకి వెళ్తే..తాజాగా ప్రముఖ చానెల్ NDTV ఆధ్వర్యంలో జరిగిన యువ ఎన్‌క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముంఢే పలు సంచలన కామెంట్స్ చేశారు. సెలెబ్రిటీలు ఎవరైనా ఒక ప్రాడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు దాన్ని వాళ్ళు కూడా వాడేందుకు రెడీ ఉండాలని అన్నారు.
ముందు తమ ఫ్యామిలీ మెంబర్స్ తోనే
డబ్బులు ఇస్తున్నారు అని ఏది పడితే అది ప్రమోట్ చేయకుండా ,దాన్ని వాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి,ఎలాంటి ప్రభావం వాడే వారి మీద పడుతుందో ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుందని తన అభిప్రాయాన్ని బయట పెట్టారు ముండే.ఇది వాడండి చాలా బాగుంటుంది అంటూ ప్రమోట్ చేస్తున్నప్పుడు దాన్ని ముందు తమ ఫ్యామిలీ మెంబర్స్ తోనే మొదటగా వాడి చూపిస్తే బాగుంటుందని ,మరి మీరు వాడమని చెబుతున్న ఆ ఉత్పత్తులని మీ పిల్లలు వాడితే ఒప్పుకుంటారా అని తనదైన శైలిలో ప్రశ్నించారు ముండే.
మరీ ముఖ్యంగా మీరు ప్రమోట్ చేస్తున్న వాటిలో కాజూ, కుంకుమపువ్వు వంటి పదార్థాలు ఉన్నాయని మీరు ప్రచారం చేస్తున్నారు బాగానే ఉంది.మరి అంతలా ఎంకరేజ్ చేస్తున్న మీరు ముందుగా వాటిని మీ కుటుంబ సభ్యులకే వాడమని చెప్పగలరా అని సెటైర్ వేశారు.
సెలెబ్రిటీలకే బాధ్యత ఎక్కువ
ఇక ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వృత్తిలో భాగమని సెలబ్రిటీలు చెప్పడంపై ముంఢే రియాక్ట్ అయ్యారు.గతంలో ప్రజలకి పాన్ మసాలాల వాళ్ళ అంతగా హాని జరుగుతుందని భావిస్తే ముందుగా ప్రభుత్వాలే వాటిని బ్యాన్ చేయవచ్చు కదా అని,పైగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం ప్రమోట్ చేసేవాళ్ళని క్వశ్చన్ చేయడం ఏంటని షారుఖ్ ఖాన్ అన్న మాటలని కూడా ముండే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలని ఇన్ఫ్లూయెన్స్ చేయగల హీరోలు ,స్టార్స్ కేవలం తమ బాధ్యతను కేవలం ఇచ్చే డబ్బులోనో, లేక అది కేవలం తమ ప్రొఫెషన్ అన్నట్టుగానో చూడకూడదని హితవు పలికారు.
“మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే మీ బాధ్యత మరింత పెరుగుతుంది కానీ తగ్గదు” అంటూ సెలెబ్రిటీలకి చురకలు అంటించారు ముంఢే . నిర్మాతకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రకటనలో కనిపించే ప్రముఖ వ్యక్తికీ అంతే సామాజిక బాధ్యత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తుపుక్ తుపుక్ గాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో
ఇదిలా ఉంటే, తుకారాం ముంఢే సారధ్యంలో మహారాష్ట్ర FDA ఈ మధ్య ఫుడ్ ,డ్రగ్స్ విషయంలో తనిఖీలు చేస్తూ అక్రమార్కులకి ముచ్చెమటలు పట్టిస్తుంది.ఇలా సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన దాడుల్లో ఏకంగా 50.6 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ దాదాపు రూ.1.19 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలు పాటించని ఆహార వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు 30 లైసెన్సులను సస్పెండ్ చేసి, 22 ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి , 30 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
also read :ఒక్కో పాట ఓ సెన్సేషన్.. రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఇవే!
మొత్తానికి ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలపై ,వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై తుకారాం ముంఢే చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ,మరి తుండే వేసిన ఈ చురకలపై ఆ తుపుక్ తుపుక్ గాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి !