Paradise Box Office:‘ది ప్యారడైజ్’… సినిమా థియేటర్ లోకి వస్తే నిజంగా స్వర్గంలానే ఉంటుందనుకున్నారు ఆడియన్స్ ,సినిమా పై మేకర్స్ ఇచ్చిన హైప్ అలాంటింది.ఇక మొదటి నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద జోరు కూడా అలాగే కనిపించింది.కానీ ఐదో రోజుకి వచ్చే సరికి సీన్ రివర్స్ అయిపొయింది.దీంతో నాలుగు రోజుల్లోనే దాదాపు 150 కోట్ల వసూళ్ళు కొల్లగొట్టిన ప్యారడైజ్ ఇక ప్యాకప్ కావాల్సిందేనా అన్న టాక్ నెట్టింట్లో జోరుగా వినిపిస్తుంది.
డివైడ్ టాక్ కాస్తా నెగెటివ్ టాక్
నిజానికి ప్రీమియర్ల నుంచి వచ్చిన హైప్, మొదటి రోజు కలెక్షన్లు, వీకెండ్‌లో కనిపించిన జోరు చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం పక్కా అనుకున్నారు.కానీ మొదటి రోజునే మొదలైన డివైడ్ టాక్ కాస్తా నెగెటివ్ టాక్ గా మారిపోవడంతో క్రమక్రమంగా సినిమా వసూళ్లు డ్రాప్ అయిపోయి ఐదో రోజుకి పరిస్థితి మరింత దిగజారిపోయిందని తెలుస్తుంది.
ఐదో రోజు సుమారు కేవలం రూ.7 కోట్ల గ్రాస్
అలా ఐదో రోజు కలెక్షన్లు 30,40 కాకుండా ఏకంగా 70 శాతానికి పైగా పడిపోయినట్టు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.5 కోట్లు మాత్రమే రావడం,మిగతా ఏరియాల్లో ఆ మాత్రం కూడా లేకపోవడంతో డీలా పడిపోయారట మేకర్స్.మొత్తంగా ఐదో రోజు సుమారు కేవలం రూ.7 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు సమాచారం. అంటే నాలుగు రోజుల పాటు కురిసిన వసూళ్ళ వర్షానికి ఇపుడు బ్రేక్ పడిందన్న మాట.
దాదాపు గా రూ.160 కోట్లకు పైగా
కలెక్షన్ వైజ్ గా చూస్తే సినిమా ఇండియాలో ఐదు రోజులకు రూ.116 కోట్ల గ్రాస్, సుమారు రూ.95 కోట్ల నెట్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ నుంచి మరో రూ.32 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా దాదాపు గా రూ.160 కోట్లకు పైగానే నిర్మాతల లెక్కల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ… బ్రేక్ ఈవెన్ ఎక్కడుంది అన్నదే అసలు ప్రశ్న. ఈ సినిమాకు థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాల అంచనా. అంటే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల తర్వాత కూడా మరో రూ.35 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అక్కడే ప్యారడైజ్‌కు అసలు పరీక్ష మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఇలాగే డ్రాప్ అవుతూ ఉంటే 35 కోట్లని అంత ఈజీగా రికవర్ కావడం అనేది దాదాపు అసాధ్యం.
also read :చిరంజీవి టాక్ షోకు రంగం సిద్ధం.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
ప్యారడైజ్ టీమ్‌కు పెద్ద టాస్క్
ఇక మొదటి నాలుగు రోజులుఎక్స్‌ప్రెస్’లా దూసుకెళ్లిన సినిమా… ఐదో రోజుకే ఆగిపోయిందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు కూడా. అయితే సినిమా ప్యాకప్ అయిపోయిందని ఇప్పుడే తెల్చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు మరో వీకెండ్ ఉంది. ఎమన్నా పికప్ అయితే చెప్పలేము,కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం ప్యారడైజ్ టీమ్‌కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి !