Actor Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామానాయుడు గారు నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకొని తన కొడుకులు సురేష్ బాబు వెంకటేష్ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేష్ బాబు నిర్మాతగా కొనసాగగా వెంకటేశ్ (Venkatesh) హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam)సినిమా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమ కొన్ని ఫోటోలను చూపిస్తూ వెంకటేష్ గారిని ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగానే వెంకటేష్ చిన్నప్పుడు ప్రేమ్ నగర్(Prem Nagar) సినిమాలో నటించిన ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటో చూపించారు. ఆ సినిమా గురించి వెంకటేష్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ప్రేమ్ నగర్ సినిమా సమయంలో నాకు నటించాలని ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉండేది కాదు. నేను స్కూల్ కి వెళ్లడంతో స్కూల్ నుంచి నాన్నగారు పిలుస్తున్నారని నన్ను సినిమా షూటింగ్ లోకేషన్ కి తీసుకువెళ్లారని తెలిపారు.
ఒక పాత్ర ఉంది నటించమని అక్కడికి వెళ్లాక చెప్పారు. ఆ టైంలో మరి నటించడానికి ఏదో ఇస్తారు కదా ఎంత ఇస్తారని నేను అడిగాను. వెంటనే నాన్న దగ్గరికి వెళ్లి విషయం చెప్పడంతో వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తను మొదటి రెమ్యూనరేషన్ 1000 రూపాయలు తీసుకున్నానని తాజాగా వెంకటేష్ రివీల్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ప్రేమ్ నగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించగా రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా 1971 సెప్టెంబర్ 24వ తేదీ విడుదల అయింది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సత్యనారాయణ చిన్ననాటి పాత్ర కేశవ వర్మ పాత్రలో నటించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ప్రస్తుతం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న వెంకటేష్ చిన్నప్పుడే 1000 రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలియడంతో ఇంత కమర్షియల్ ఏంటి వెంకీ మామ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా బాలనటుడిగా పలు సినిమాలలో నటించిన వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా హీరోగా వరుస కుటుంబ కథ సినిమాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?