E-Paper
Advertisement

తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!

తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!
Advertisement

Teja Sajja -The Traitors: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ (Teja Sajja)ఒకరు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు టాక్ షోలకు హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రముఖ ఇంటర్నేషనల్ రియాలిటీ గేమ్ షో ‘ ది ట్రైటర్స్ ‘(The Traitors)   ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.

ఇన్నో సెంట్స్ VS ట్రైటర్స్ ..

ఇక ఈ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జ సందడి చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రైమ్ వీడియో (Prime video)తాజాగా ఈ షో కి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ రియాలిటీ షో అక్టోబర్ 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. ఈ రియాలిటీ షో ఫార్మాట్ విషయానికి వస్తే.. ఈ షో మొత్తం పది ఎపిసోడ్లు ఉంటాయి. ఇందులో 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే వీరిలో ఇన్నో సెంట్స్, ట్రైటర్స్ గా ఆట కొనసాగుతుంది అయితే ఈ ఆట మోసాలు ,నమ్మకాల ఆధారంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రియాలిటీ షో పట్ల భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి.

రూ.15 కోట్ల రెమ్యూనరేషన్..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే సెలబ్రెటీ కంటెస్టెంట్లు ఎవరు అనే వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇలా తేజ సజ్జ హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రియాలిటీ షో కోసం ఈయన తీసుకోబోయే రెమ్యూనరేషన్  గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సినిమాలపరంగా తేజ సజ్జ తన ఒక్కో సినిమాకు 10- 15 కోట్ల వరకు  రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ ది ట్రైటర్స్ ‘ షో హోస్ట్ గా కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

ఈ రియాలిటీ షో కోసం తేజ సజ్జ ఒక్కో ఎపిసోడ్ కు గాను 1.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ఇలా ఒక్కోఎపిసోడ్ కు ఈ రేంజ్ లో ఈయన రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే నేరుగా ఒక సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. కేవలం పది ఎపిసోడ్లకు 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదంటూ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం తేజ సజ్జ ఈ రియాలిటీ షో తో పాటు హనుమన్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!

Related News

ప్యారడైజ్ ప్యాకప్ అయినట్టేనా?

చిరంజీవి టాక్ షోకు రంగం సిద్ధం.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

ఆ చెత్తను ముందు మీ పిల్లలకు పెట్టండి.. షారుఖ్, అజయ్ దేవగన్‌పై ఎఫ్‌డీఏ కమిషనర్ ఫైర్

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

జోరు పెంచిన మమితా బైజు.. సంక్రాంతి టార్గెట్ గా ‘హలో డియర్’!

త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×