E-Paper
Advertisement

AI కంపెనీకి  షాక్ ఇచ్చిన ఊర్వశి రౌతేలా.. రూ. 7 వేల కోట్ల దావా!

AI కంపెనీకి  షాక్ ఇచ్చిన ఊర్వశి రౌతేలా.. రూ. 7 వేల కోట్ల దావా!
Advertisement

Urvashi Rautela: ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి ఇది ప్రయోజనకరంగా మారినప్పటికీ మరి కొంతమందికి మాత్రం ఎన్నో సమస్యలను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఏ ఐ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే తమ అనుమతి లేకుండా పలువురు సెలబ్రిటీల పేర్లు, ఫోటోలను ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి సైతం ఏ ఐ కంపెనీపై (AI Company)ఏకంగా పరువు నష్టం దావా వేశారు.

అనుమతి లేకుండా ఫోటోలు వాడటం..

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేసిన ముద్దుగుమ్మ ఊర్వసి రౌతేలా (Urvashi Rautela)తాజాగా ఏఐ కంపెనీ పై పరువు నష్టం దావా వేశారు. లాస్ ఏంజిల్స్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టెక్నాలజీ కంపెనీ పై ఈమె ఈ కేసు వేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలుతో పాటు తన వీడియోలను ఉపయోగించారని ఈమె ఆరోపించారు. ఈ విషయం గురించి ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఊర్వసి పేరుతో బిలియన్ డాలర్ల వ్యాపారం..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఊర్వశి స్పందిస్తూ.. ఏఐ టెక్నాలజీ కంపెనీ తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు వీడియోలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించారు. ఈ విషయ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడినందుకుగాను రూ.7 వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు. ఈమె పేరును అనుమతి లేకుండా ఉపయోగించి సదురు కంపెనీ బిలియన్ల డాలర్ల వ్యాపారం చేసిందని, అందుకే తాము 7000 కోట్ల దావా వేసినట్టు తెలిపారు. మీ కంపెనీ అభివృద్ధి కోసం సెలబ్రిటీల ఫోటోలు వీడియోలు ఉపయోగించడంలో తప్పులేదు కానీ వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఈమె బృందం హెచ్చరించింది.

Advertisement

ఇలా ఏఐ కంపెనీపై ఈమె ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇప్పటికే ఏఐ రూపొందించిన చిత్రాలు, డీప్‌ఫేక్‌లతో సెలబ్రిటీలు తమ వ్యక్తిత్వ హక్కుల అనధికార వినియోగానికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం పై పలువురు సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సైతం ఈ అంశం గురించి మాట్లాడుతూ ఏఐ వీడియోలపై మండిపడ్డారు. మరి ఊర్వశి ఏఐ కంపెనీ పై ఏకంగా ఏడు వేలకోట్ల పరువు నష్టం దావా వేయడంతో సదరు ఏఐ కంపెనీ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!

Related News

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

సాయి పల్లవి ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్యారడైజ్ ప్యాకప్ అయినట్టేనా?

తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!

చిరంజీవి టాక్ షోకు రంగం సిద్ధం.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

ఆ చెత్తను ముందు మీ పిల్లలకు పెట్టండి.. షారుఖ్, అజయ్ దేవగన్‌పై ఎఫ్‌డీఏ కమిషనర్ ఫైర్

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!

Big Stories

Advertisement
×