E-Paper
Advertisement

చిరంజీవి టాక్ షోకు రంగం సిద్ధం.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

చిరంజీవి టాక్ షోకు రంగం సిద్ధం.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
Advertisement

Chiranjeevi OTT Entry:ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ తో డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయగా ఇపుడు అదే బాటలో నేనూ అంటున్నాడట మెగా స్టార్ చిరు.అవును …ఇప్పటివరకు సినిమాలు, కౌన్ బనేగా కరోడ్ పతి అంటూ టీవీషో లతో ఆకట్టుకున్న చిరు ఇపుడు ఒక పూర్తి స్థాయి సెలబ్రిటీ టాక్ షోతో మొదటిసారిగా ఓటీటీ ఆడియన్స్ ని పలకరించాబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ షో కోసం చిరంజీవితో చర్చలు జరుపుతుందని,త్వరలోనే ఈ టాక్ షో పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది.

అయితే చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టాక్ షోను ఒక మామూలు ఇంటర్వ్యూ లా కాకుండా భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఇక ఇందులో చిరు చేసిన సినిమాలు, వ్యక్తిగత అనుభవాలు, ఇండస్ట్రీలో తన జర్నీ, ప్రస్తుత విషయాలుఅలాగే సినీ సెలెబ్రిటీలతో సరదా సరదా చాటింగ్ వంటి ఎన్నో వెరైటీ ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేయనున్నారని తెలుస్తుంది.

Advertisement

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టాక్ షోకోసం చిరు ఏకంగా రూ.200 కోట్ల భారీ మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందని టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో ఎంతవరకు నిజముందో మరిన్ని రోజులు గడిస్తే కాని తెలీదు. ఒకవేళ ఈ మొత్తం నిజమైతే, మాత్రం ఇండియన్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ సెలబ్రిటీ డీల్‌లలో ఒకటిగా నిలిచే అవకాశాలు పుష్కలం.

ఇక అన్ స్టాపబుల్ షోకి కాన్సెప్ట్ అందించిన ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవినే ఈ షోకి కూడా కాన్సెప్ట్ అందించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిరంజీవి కుటుంబం నుంచి కూడా కీలక పాత్ర ఉందని టాక్. ఆయన కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల ఈ డీల్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుందని తెలుస్తుంది. చిరంజీవి కెరీర్‌లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అనేది మొదటి సరి కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు.

Advertisement

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ..దర్శకుడు బాబీతో ఆయన చేస్తున్న ‘కాకా’పై భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి తెల్సిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఇక జోరుగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమాని మేకర్స్ 2027 సంక్రాంతి సీజన్‌ లో దించబోతున్నారని ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.

ప్రస్తుతం కాకా షూటింగ్ జోరుగా సాగుతున్న దాన్ని బట్టి చూస్తే పొంగల్ రిలీజ్ తర్వాతే ఈ సరికొత్త టాక్ షో మొదలవబోతుందన్న మాట.చూడాలి మరి తొలిసారి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న చిరు అన్ స్టాపబుల్ ని ఎలా మరిపిస్తాడో !

also read :ఆ చెత్తను ముందు మీ పిల్లలకు పెట్టండి.. షారుఖ్, అజయ్ దేవగన్‌పై ఎఫ్‌డీఏ కమిషనర్ ఫైర్

Tags

Related News

ప్యారడైజ్ ప్యాకప్ అయినట్టేనా?

తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!

ఆ చెత్తను ముందు మీ పిల్లలకు పెట్టండి.. షారుఖ్, అజయ్ దేవగన్‌పై ఎఫ్‌డీఏ కమిషనర్ ఫైర్

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

జోరు పెంచిన మమితా బైజు.. సంక్రాంతి టార్గెట్ గా ‘హలో డియర్’!

త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×