E-Paper
Advertisement

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: పోలీసుల్లా నటిస్తూ డ్రగ్ డీలర్లను దోచుకోవడం అనేది అస్సలు ఊహకు అందని విషయం. అయితే అలా వెళ్ళినా తాము నిజమైన పోలీసులే కాదని ఎవరికీ తెలియకపోతే డబ్బు కొల్లగొట్టొచ్చు. అలాగే ఎలాంటి ప్రమాదం కూడా ఉండదని ఇద్దరు స్నేహితులు అనుకుంటారు. కానీ అలా ఒక రోజు వాళ్లు ఎంచుకున్న టార్గెట్ సాధారణ డ్రగ్ డీలర్ కాదు. ఆ ఒక్క తప్పు వాళ్లను అమెరికా ఈస్ట్ కోస్ట్‌ లో దాగి ఉన్న భారీ డ్రగ్ నెట్‌ వర్క్ లో చిక్కుకుంటారు. తప్పించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ సమస్య పెద్దదవుతుంది. ఈ స్టోరీలైన్ తో రూపొందిన క్రైమ్ థ్రిల్లరే ‘డోప్ థీఫ్’ (Dope Thief). మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే ?

కథలోకి వెళ్తే…

ఫిలడెల్ఫియాకు చెందిన రే‌, మానీ ఇద్దరూ చాలాకాలంగా స్నేహితులు. ఇద్దరి జీవితాల్లోనూ డబ్బు సమస్యలు ఉంటాయి. చిన్నచిన్న నేరాలు చేస్తూ బతికే వాళ్లు ఓ కొత్త పద్ధతి కనిపెడతారు. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ DEA అధికారుల్లా నటించి డ్రగ్ డీలర్ల ఇళ్లపై దాడి చేసినట్లు చేసి… డబ్బు, డ్రగ్స్ దోచుకోవడం మొదలుపెడతారు. మొదట వాళ్ల ప్లాన్ పని చేస్తుంది. అసలు పోలీసులని అనుకుని డ్రగ్ డీలర్లు భయపడిపోవడంతో పెద్దగా ప్రతిఘటన ఉండదు. దీంతో రే, మానీకి ఈ పని మరింత లాభదాయకంగా అనిపిస్తుంది.

Advertisement

ఒక దశలో వాళ్లు మరో వ్యక్తిని కూడా తమతో కలుపుకుంటారు. కానీ వాళ్లు ఎంచుకున్న ఓ కంట్రీ హౌస్ మొత్తం గేమ్‌ ను మార్చేస్తుంది. ఆ ఇంటిపై దాడి చేయడం చిన్న దొంగతనం అనుకున్న వాళ్లకు అక్కడ ఎదురయ్యే పరిస్థితులు ఊహించని ప్రమాదాన్ని తెస్తాయి. ఎవరి డబ్బును దోచుకున్నారో కూడా వాళ్లకు తెలియదు. వాళ్లు చేసిన తప్పు వెనుక పెద్ద డ్రగ్ నెట్‌వర్క్ ఉందని తరువాత తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇతరులను భయపెట్టిన రే, మానీ… ఇప్పుడు తెలియని వ్యక్తుల నుంచి పారిపోవాల్సి వస్తుంది. తమ కుటుంబాలను సురక్షితంగా ఉంచుకోవడం మరో సమస్యగా మారుతుంది.

మరోవైపు నిజమైన అధికారులు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెడతారు. రే ఒకవైపు పోలీసుల నుంచి తప్పించుకోవాలి. మరోవైపు తాము దోచుకున్న నేరస్థుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలి. మానీ మాత్రం జరిగిన పరిణామాల తర్వాత మరిన్ని సమస్యల్లో పడతాడు. చిన్నస్థాయి దొంగతనంగా మొదలైన వ్యవహారం చివరకు భారీ డ్రగ్ కారిడార్‌ ను బయటపెట్టే స్థాయికి చేరుతుంది. ఈ నెట్‌వర్క్‌ లో ఎవరెవరు ఉన్నారు ? రే-మానీ చేసిన దోపిడీకి దాని సంబంధం ఏంటి ? వాళ్లు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు ? అనేదే కథలో ఉత్కంఠభరితంగా చూడాల్సిన విషయం.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

బ్రియాన్ టైరీ హెన్రీ (Brian Tyree Henry), వాగ్నర్ మౌరా (Wagner Moura), వింగ్ రేమ్స్ (Ving Rhames) కలిసి నటించిన సిరీస్ ‘డోప్ థీఫ్’. దీనికి పీటర్ క్రెయిగ్ (Peter Craig) క్రియేటర్. రిడ్లీ స్కాట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే తెలుగు డబ్ లేదు. సిరీస్ ను ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది.

Read Also: ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

Tags

Related News

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×