E-Paper
Advertisement

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్ ‘ పై త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!
Advertisement

NTR -God Of War Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈయన తన తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్..

Advertisement

ఈ సినిమాని వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ పనులకు ఎన్టీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చేతికి సర్జరీ జరిగిన నేపథ్యంలోనే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈయన తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. “గాడ్ ఆఫ్ వార్”(God Of War) అని టైటిల్ తో ఈ సినిమా రాబోతుందని ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో ఉండబోతోందని ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం..

Advertisement

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో కలిసి ఆదర్శ కుటుంబం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 9 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎన్టీఆర్ తో చేయబోయే గాడ్ ఆఫ్ వార్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ…

స్క్రిప్ట్ మొత్తం సిద్ధం..

తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే ఉండబోతుందని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందని, టైటిల్ ఇంకా ఫైనల్ చేయలేదంటూ త్రివిక్రమ్ తెలియజేశారు. ఇలా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయ్యిందనే విషయం తెలియచేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనేది అసలైన టైటిల్ కాదని, ఈ సినిమాకు ఇంకొక టైటిల్ కూడా ఉండబోతుందని త్రివిక్రమ్ మాటల ద్వారా స్పష్టమవుతుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు నటీనటులకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

Related News

ఆ చెత్తను ముందు మీ పిల్లలకు పెట్టండి.. షారుఖ్, అజయ్ దేవగన్‌పై ఎఫ్‌డీఏ కమిషనర్ ఫైర్

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

జోరు పెంచిన మమితా బైజు.. సంక్రాంతి టార్గెట్ గా ‘హలో డియర్’!

త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?

ఒక్కో పాట ఓ సెన్సేషన్.. రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఇవే!

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీమ్..నాని ప్రత్యేక పూజలు!

రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత తీసుకునేవారో తెలుసా?

Big Stories

Advertisement
×