E-Paper
Advertisement

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!
Advertisement

Nothing Phone 3 Price Cut: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రీమియం లుక్, మంచి ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ స్థాయి అనుభవం కావాలని చూస్తున్నారా? అయితే ఇప్పటివరకు ధర కారణంగా నథింగ్ ఫోన్ 3ను పక్కన పెట్టిన వారికి ఇది మంచి సమయం. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. లాంచ్ సమయంలో ధర చూసి ఆలోచించిన ఫోన్‌నే ఇప్పుడు ఏకంగా రూ.27,000 వరకు తక్కువకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. అసలు ఈ ఆఫర్‌తో నథింగ్ ఫోన్ 3 ధర ఎంతకు దిగి వచ్చింది? ఆఫర్‌లో ఏం ఉంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ధర ఎంత తగ్గింది?

మార్కెట్లోకి వచ్చిన కొత్తలో ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర అప్పట్లో రూ.79,999 ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో దీనిని రూ.51,999కే లిస్ట్ చేశారు. అంటే.. లాంచ్ అయిన ధరకు, ప్రస్తుత ధరకూ దాదాపు రూ.27,000 తేడా ఉంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. మరో 2.5 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా వర్తిస్తే ఈ ఫోన్ మనకు సుమారు రూ.50,700కే చేతికి వచ్చేస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఇంకాస్త తక్కువ ధరకే దక్కే అవకాశం ఉంది.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

కెమెరా, డిస్‌ప్లే హైలైట్స్:

ఈ ఫోన్‌లో కెమెరాల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందు వెనుక అని తేడా లేకుండా అన్ని వైపులా అద్భుతమైన లెన్స్‌లు ఇచ్చారు. వెనక వైపు ఏకంగా మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరానే పెట్టారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనిలో 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వీడియోలు చూస్తున్నప్పుడు, గేమ్‌లు ఆడుతున్నప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఫోన్ పనితీరు కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ Gen 4 ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై రన్ అవుతుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే.. దీనిలో 5,500mah పెద్ద బ్యాటరీ ఇచ్చారు. దీనికి తోడు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుంది. బరువు కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ.. ఫీచర్లు మాత్రం అదుర్స్ అనిపిస్తాయి.

ఈ ఆఫర్ వర్తేనా?

ఒక మంచి డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఈ నథింగ్ ఫోన్ 3 మంచి ఆప్షన్ అవుతుంది. మొదట్లో ఉన్న భారీ ధర కారణంగా ఈ ఫోన్‌ను కొనలేకపోయిన వాళ్లకు ప్రస్తుత అమెజాన్ ధర మంచి ఛాన్స్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఎప్పుడు మారుతాయో చెప్పలేం కాబట్టి.. కొనేముందు ఒకసారి అన్నీ సరిచూసుకోవడం మంచిది.

Also Read: కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!

Tags

Related News

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×