E-Paper
Advertisement

Anil Ravipudi: టీఆర్పీలో అనిల్ లెగసీ.. ఏ మూవీకి ఎంత రేటింగ్.. హైయెస్ట్ మీ హీరోదే!

Anil Ravipudi: టీఆర్పీలో అనిల్ లెగసీ.. ఏ మూవీకి ఎంత రేటింగ్.. హైయెస్ట్ మీ హీరోదే!
Advertisement

Anil Ravipudi:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ ఎంటర్‌టైనర్లను ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్, అటు థియేటర్లలోనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా టీఆర్పీ రేటింగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. థియేటర్లలో సినిమా మిస్ అయినా, టీవీలో మాత్రం అనిల్ రావిపూడి బొమ్మ పడిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. మరి అనిల్ మూవీస్ లో ఏ మూవీ కి ఎంత రేటింగ్ వచ్చిందో చూద్దాం ..

బుల్లితెరపై అనిల్ మార్క్ – టీఆర్పీల వర్షం:

అనిల్ రావిపూడి సినిమాలకు థియేటర్లలో ఎంత క్రేజ్ ఉంటుందో, బుల్లితెరపై అంతకు మించిన ఆదరణ ఉంటుంది. దీనికి నిదర్శనమే ఆయన సినిమాల టీఆర్పీ రేటింగ్స్. ‘పటాస్’ (9.3), ‘సుప్రీమ్’ (15.4), ‘రాజా ది గ్రేట్’ (18.4) వంటి సినిమాలతో మొదలైన ఈ జోరు ఇప్పటికీ తగ్గలేదు. ‘F2’ 18.6 రేటింగ్‌తో అదరగొడితే, ‘F3’ 9.3, ‘భగవంత్ కేసరి’ 9.9 రేటింగ్స్ సాధించాయి. ఇక ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏకంగా 18.3 రేటింగ్ తెచ్చుకోగా, మెగాస్టార్‌తో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ కూడా 14.2 టీఆర్పీతో దూసుకుపోయింది. ఈ లెక్కలు చూస్తుంటే అనిల్ సినిమాలకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఫిదా అవుతున్నారని అర్థమవుతోంది.

Advertisement

మహేష్ బాబుతో ఆల్ టైమ్ రికార్డ్ :

అనిల్ రావిపూడి కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే టీఆర్పీ విషయంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ ఒక మైలురాయిగా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 24.2 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ చాలా సినిమాలకు ఈ రికార్డు అందుకోలేని స్థాయిలోనే ఉంది. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా, కథలో అనిల్ జోడించే కామెడీ, ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

అనిల్ రావిపూడి.. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్:

Advertisement

వెండితెర మీద నవ్వులు పూయించడమే కాదు, టీవీ స్క్రీన్ ముందు కుటుంబాలను కూర్చోబెట్టడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. ‘మన శంకర్ వరప్రసాద్’ విజయంతో అనిల్ క్రేజ్ మరింత పెరిగింది. హీరో ఎవరైనా సరే, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు సినిమా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. భవిష్యత్తులో రాబోయే సినిమాలతో ఆయన ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తారో చూడాలి. ముఖ్యంగా సంక్రాంతి సెంటిమెంట్‌తో ఆయన చేసే మేజిక్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ కాసుల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో అనిల్ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ 2027 సంక్రాంతికి సిద్ధమవుతోంది. దీనిపై కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×