Shoaib Akhtar: ది హండ్రెడ్ 2026 వేలంలో ( The Hundred Auction ) అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) ఓనర్ కావ్య మారన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కొనుగోలు చేయడంపై తీవ్ర స్థాయిలో కావ్య మారన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కావ్య పాపకు ( Kavya Maran) సపోర్ట్ గా పాకిస్తాన్ నుంచి వాయిస్ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ ను మెచ్చుకుంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar). కావ్య పాప కాదు, ఆమె పాకిస్థాన్ కాటేరమ్మ..దండేసి, దండం పెట్టాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. కావ్య మారన్ ధైర్య శాలి అంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు.
Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..సన్ రైజర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి
లండన్ వేదికగా ది హండ్రెడ్ 2026 వేలం రెండు రోజుల కిందట జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ లో సన్రైజర్స్ లీడ్ జట్టు కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక ఈ జట్టుకు ఓనర్ కావ్య పాప అన్న సంగతి తెలిసిందే. అయితే మినీ వేలంలో భాగంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ఏరి కోరి కొనుగోలు చేసింది కావ్య పాప. అతడు వేలంలోకి రాగానే రూ. 2.34 కోట్లు చల్లింది. దీంతో అంత రేటు పెట్టేందుకు జట్టు కూడా ముందుకు రాలేదు. దీంతో సన్రైజర్స్ లీడ్స్ జట్టు సొంతమయ్యాడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్. అయితే వేలంలో అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కావ్య పాప దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
కావ్య పాపకు పాకిస్తాన్ జెర్సీ వేసి మరీ, ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ఐదు సంవత్సరాలు బ్యాన్ విధించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇలా ఒక్క వేలం పాటతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కావ్య పాపకు సపోర్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నిలిచాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు షోయబ్ అక్తర్. కావ్య మారన్ ధైర్య శాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇండియన్స్ ఎవరు చేయని చేయని పనిని చేసి చూపించిందని కావ్య పాపను మెచ్చుకున్నారు షోయబ్ అక్తర్. కావ్య పాప కాదు, ఆమె పాకిస్థాన్ కాటేరమ్మ అంటూ మెచ్చుకున్నారు. కావ్య పాపకు దండేసి, దండం పెట్టాల్సిందే అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో పాక్ ప్లేయర్ అబ్రార్ ను కొనుగోలు చేసిందని, కావ్య ధైర్యాన్ని మెచ్చుకున్నారు అక్తర్.
🚨 Shoaib Akhtar on Kavya Maran 🚨
Shoaib Akhtar says Kavya Maran is a fearless woman for signing Abrar Ahmed.
🗣️ “Kavya is fearless. She’s buying Pakistani players without mixing politics into sport — that’s good for cricket’s future.”
He also said cricket should remain… pic.twitter.com/tI9bMf2VvU
— SubhaM ThakuR (@SubhaMThakuR) March 13, 2026