Kiara Advani: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి చిన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా నిత్యం వార్తలలో ఉండటానికి వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం సెలబ్రిటీలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ తల్లి కాబోతోంది అంటే వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
బేబీ బంప్ …
ముఖ్యంగా బేబీ బంప్(Baby Bump) ఫోటోలను నిత్యం అభిమానుల కోసం షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సీ(Pregnancy) విషయంలో మాత్రం నటి కియారా తీసుకున్న నిర్ణయం పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ బేబీ బంప్ ఫోటోలు ఎన్నో విమర్శలకు కారణమయ్యాయి. కానీ ఈమె మాత్రం తన ప్రేగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయలేదు అలాగే మీడియా కంట కూడా కనపడకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో తరచూ చెకప్ కోసం హాస్పిటల్ కి వస్తున్న సమయంలో కూడా మీడియా వారు ఫోటోలు తీసుకోవడానికి వీలు లేకుండా హీరో సిద్ధార్థ మల్హోత్రా(Siddarth Malhotra) ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మీడియా కంటపడని కియారా…
మీడియా వారికి కూడా కియారా కనిపించకుండా ఆమె హాస్పిటల్ లోపలికి వెళ్లే సమయంలో గొడుగును అడ్డుగా పెడుతూ కియారా ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రెగ్నెన్సీ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీల ఆలోచనలకు విరుద్ధంగా ఈ జంట తీసుకున్న నిర్ణయం పట్ల,కియార విషయంలో హీరో సిద్ధార్థ్ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల పట్ల కూడా అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ మల్హోత్రా, కియార ఫిబ్రవరి 7, 2023వ సంవత్సరంలో రాజస్థాన్లోని సూర్యగడ్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.
?igsh=MThzbDllOTJ6N2loYw%3D%3D
పెళ్లి తర్వాత కూడా కియారా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక పెళ్లయిన కొద్ది రోజులకి ఈమె తల్లి కాబోతున్నానని శుభవార్త తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్(Game Changer) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మరోసారి అభిమానులను నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్హృ, తిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్2 (War 2)సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక వార్ 2 ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Also Read: The Big Flok Night : బిగ్ టీవీ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ కన్సర్ట్.. ఎప్పుడు? ఎక్కడంటే?