Viral Video : వాళ్లిద్దరూ భార్యాభర్తలు. టైంపాస్‌కు అలా బయట తిరిగొద్దామంది ఆ భార్య. సరే అన్నాడు భర్త. షికారుకు అంటూ ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదకు తీసుకెళ్లింది. వంతెనపై నిలుచుని… సరదాగా సెల్ఫీలు దిగుతున్నట్టు యాక్టింగ్ చేసింది. మంచి టైమ్, పొజిషన్ చూసి.. భర్తను ఒక్కసారిగా నదిలో తోసేసింది. ఖేల్ ఖతం. మొగుడు ఫసక్ అనుకుంది. కట్ చేస్తే….
నదితో తోసేసినా.. అలా బతికిపోయాడు..
తెలంగాణ, కర్నాటక సరిహద్దులోని కృష్ణా నది దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రాయచూరు జిల్లాలోని గుర్జాపూర్ బ్రిడ్జ్ వద్ద తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది ఆ మహిళ. అంత వరకు సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం ఆమె ఊహించినట్టు జరగలేదు అక్కడ. ఆ భర్త నదిలో కొట్టుకుపోలేదు. నది మరీ లోతుగా ఏమీ లేదు. కొద్ది దూరం కొట్టుకుపోయిన అతను నది మధ్యలో ఉన్న చెట్టు కొమ్మలను పట్టుకుని సేఫ్‌గా బతికిపోయాడు. నదిలో ఉన్న ఓ బండరాయిపై కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నాడు. భర్త అలా కులాసాగా నది మధ్యలో కూర్చోవడం చూసి.. ఆ భార్య షాక్ షాక్ అయింది.
పర్‌ఫెక్ట్ ప్లాన్.. రాంగ్ స్పాట్
అదేంటి.. భర్త నీళ్లలో మునిగి, కొట్టుకుపోయి చావకుండా ఇంకా బతికే ఉన్నాడేంటి అని ఆ మహిళ బిత్తరపోయింది. మర్డర్ ప్లాన్ బాగానే వేసింది కానీ.. డెత్ స్పాట్ మాత్రం సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదామె. ఇప్పుడెలా? ఇంకెలా చంపుదాం అనుకుంటూ అక్కడికక్కడే మరో ప్లాన్ వేస్తోంది. అంతలోనూ అనుకోని పరిణామం. ఆ బ్రిడ్జి దగ్గరే ఉన్న స్థానికులు నది మధ్యలో రాయిపై ఉన్న అతడిని చూశారు. వెంటనే రంగంలోకి దిగారు. కాపాడే ప్రయత్నం చేశారు. తాడు సాయంతో ఆ భర్తను సురక్షితంగా బ్రిడ్జిపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అసలు సీన్ మరింత ట్విస్ట్ ఇచ్చింది.
తోసేసిందా? పడిపోయాడా?
సెల్ఫీ దిగుదామంటూ నమ్మించి.. భార్యనే తనను నదిలోకి తోసేసిందని ఆ భర్త అంటున్నాడు. కాదు కాదు.. సెల్ఫీ దిగుతుంటే ఆయనే కంట్రోల్ తప్పి నదిలో పడిపోయాడని ఆ భార్య చెబుతోంది. ఇద్దరిలో ఎవరి ఆరోపణ నిజమో కానీ.. విషయం తెలిసి బంధువులంతా తరలివచ్చారు. మేటర్ పోలీసుల వరకూ చేరింది. కేసు నమోదు చేసి ఆ భార్యాభర్తలను ప్రశ్నిస్తున్నారు.
Also Read : నాగలికి కట్టేసి.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఎలా హింసించారంటే..
భర్తలూ జర జాగ్రత్త..
భర్తలూ జర జాగ్రత్త. ఇటీవల భార్యల ఘాతుకాలకు బలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు.. చాలా పక్కాగా మర్డర్ స్కెచ్‌లు వేస్తున్నారు. దాదాపు అన్ని కేసుల్లోనూ భార్య దొరికిపోతోంది. అయినా, హత్యలు ఆగట్లేదు. ఆ ప్రయత్నాలు ఆపట్లేదు. అందుకే పాపం.. ఇప్పుడు పెళ్లంటేనే భయపడి చస్తున్నారు కొందరు మగాళ్లు.